Oscar 2023 : ఆస్కార్‌‌కి ఎన్టీఆర్, చరణ్‌లు మాత్రమే కాదు జాక్వెలిన్ కూడా తన సాంగ్‌తో పోటీ పడుతుంది.. తెలుసా?

RRR ఆస్కార్ గెలవాలి అంటూ ఇండియన్ ఆడియన్స్ అంతా కోరుకుంటుంటే, ఇండియన్ యాక్ట్రెస్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ మాత్రం.. నాటు నాటు సాంగ్ కి కాకుండా తాను నటించిన సాంగ్ కి ఆస్కార్ రావాలి అని కోరుకుంటుంది.

Oscar 2023 : ఆస్కార్‌‌కి ఎన్టీఆర్, చరణ్‌లు మాత్రమే కాదు జాక్వెలిన్ కూడా తన సాంగ్‌తో పోటీ పడుతుంది.. తెలుసా?

Oscar 2023 : ఇప్పటి వరకు మూడు ఇండియన్ సినిమాలు ఆస్కార్ నామినేషన్స్ నిలిచాయి. ఆ మూడు సినిమాలు కూడా బాలీవుడ్ పరిశ్రమ నుంచే ఎంపిక అయ్యాయి. ఇప్పటి వరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ మాత్రమే అనుకున్న హాలీవుడ్ టెక్నీషియన్స్ కి సౌత్ ఇండస్ట్రీలో పలు సినీ పరిశ్రమలు ఉన్నాయి, అవి కూడా గొప్ప సినిమాలు తీస్తాయి అంటూ రాజమౌళి అండ్ టీం RRR తో హాలీవుడ్ వారికీ తెలియజేశారు. నాటు నాటు అంటూ ఒక సౌత్ ఇండియన్ సాంగ్ తో మొత్తం ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేశారు. ప్రస్తుతం ఈ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ కి పోటీ పడుతున్న సంగతి తెలిసిందే.

Oscar 2023 : ప్రీ ఆస్కార్ పార్టీ ఇచ్చిన ప్రియాంక చోప్రా.. ఎన్టీఆర్, చరణ్, ప్రీతి జింతా సందడి!

ఇండియా నుంచి ఒక సాంగ్ ఆస్కార్ నామినేషన్స్ లో ఉండడం ఇదే మొదటిసారి. ఈ పాట కూడా ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని బాగా అలరించడంతో ఆస్కార్ గెలవడం పక్కా అంటున్నారు అంతా. దీంతో ఇండియన్ ఆడియన్స్ అంతా RRR ఆస్కార్ గెలవాలి అంటూ కోరుకుంటున్నారు. అయితే ఒక ఇండియన్ యాక్ట్రెస్ మాత్రం.. నాటు నాటు సాంగ్ కి కాకుండా తాను నటించిన సాంగ్ కి ఆస్కార్ రావాలి అని కోరుకుంటుంది. బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హాలీవుడ్ మూవీ ‘టెల్ ఇట్ లైక్ ఏ ఉమెన్’ సినిమాలో నటించింది.

RRR : ఆస్కార్ స్టేజి పై నాటు నాటు సాంగ్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చేది ఎవరో తెలుసా?

ఈ సినిమాలోని ‘అప్లాజ్’ అనే సాంగ్ కూడా ఆస్కార్ నామినేషన్స్ నాటు నాటు సాంగ్ తో పోటీ పడుతుంది. దీంతో తన ఇన్‌స్టాగ్రామ్ లో ఆ సాంగ్ ని పోస్ట్ చేస్తూ.. ”అప్లాజ్ సాంగ్ కి నా హృదయంలో ఎప్పటికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ పాట ఆస్కార్ గెలవాలని ఆశిస్తున్నా” అంటూ రాసుకొచ్చింది. మరి ఎన్టీఆర్, చరణ్‌ల పై జాక్వెలిన్ పై చెయ్యి సాధిస్తుందా? లేదా? చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Jacqueline Fernandez (@jacquelinef143)