Chiranjeevi : ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి జగన్?? అందుకోసమేనా??

ప్రమోషన్స్ లో భాగంగా ఆచార్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో నిర్వహించనున్నట్టు, దానికి ముఖ్య అతిధిగా ఏపీ సీఎం జగన్ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

Chiranjeevi : ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి జగన్?? అందుకోసమేనా??

Chiru

 

Acharya :  మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా ‘ఆచార్య’. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులని అలరించాయి. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలు సార్లు వాయిదా పడిన ఆచార్య ఏప్రిల్ 29న రిలీజ్ అవుతుంది. త్వరలో ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టనున్నారు చిత్రయూనిట్. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఆచార్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో నిర్వహించనున్నట్టు, దానికి ముఖ్య అతిధిగా ఏపీ సీఎం జగన్ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ వార్త చక్కర్లు కొడుతుంది. ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కి జగన్ హాజరవుతున్నట్టు సమాచారం. అయితే ఆచార్య ఇక్కడ హైదరాబాద్ లో కాకుండా విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎందుకు పెడుతున్నట్టు? జగన్ ఎందుకు ముఖ్య అతిధిగా వస్తున్నారు అని కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటీవల సినిమా టికెట్లు, థియేటర్ల విషయంలో సినీ పరిశ్రమ, అనుబంధ పరిశ్రమలని ఏపీ ప్రభుత్వం బాగా ఇబ్బంది పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సమస్యలని తొలగించడానికి చిరంజీవి ముందుండి పలు మార్లు జగన్ ని కలిసి ప్రష్కరించడానికి ప్రయత్నించారు. ఏపీలో సినీ సమస్యలు పరిష్కారం అయ్యాయి అంటే అది చిరంజీవి చలువే. ఒకానొక టైంలో చిరంజీవి లాంటి స్థాయి వ్యక్తి జగన్ వద్దకి వెళ్లి చేతులు జోడించి సినీ పరిశ్రమని బతికించండి అంటూ ప్రాధేయపడ్డారు. ఈ వీడియో చుసిన వారంతా చాలా బాధపడ్డారు. ఈ విషయంలో జగన్ ని, ఏపీ ప్రభుత్వాన్ని మెగా అభిమానులు, సినీ ప్రేమికులు, విపక్షాలు చాలా విమర్శించారు.

RRR: ఆర్ఆర్ఆర్ 22 రోజుల వరల్డ్‌వైడ్ కలెక్షన్స్.. ఎంతంటే?

ఏపీ ప్రభుత్వం సినీ పరిశ్రమని ఏపీలో విస్తరించాలని, అక్కడ కూడా షూటింగ్స్ చేయాలని, సినీ కార్యక్రమాలని నిర్వహించాలని తెలిపింది. ఈ విషయంలో మాత్రం ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్ గానే ఉంది. దీంతో ఇటీవల రిలీజ్ అయినా చాలా సినిమాల సక్సెస్ మీట్స్, ప్రెస్ మీట్స్ ఏపీలో కూడా నిర్వహించారు. ఇక ఇటీవలే మళ్ళీ మంత్రివర్గం కూడా మారడంతో ఏపీ ప్రభుత్వాన్ని మరింత కూల్ చేసి సినీ పరిశ్రమకి సపోర్ట్ ఉండేలా చూడటానికే ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో ప్లాన్ చేసి జగన్ ని పిలుస్తున్నట్టు, ఆయనతో పాటే కొత్త సినిమాటోగ్రాఫర్ వేణుగోపాల్ కృష్ణ ని కూడా పిలుస్తున్నట్టు సమాచారం.

KGF2: కేజీయఫ్2 రెండు రోజుల వసూళ్లు.. తెలుగు రాష్ట్రాల్లోనూ రాఖీ భాయ్ హవా!

అంతేకాక “ఆచార్య” సినిమాను నిర్మించింది సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడు, న్యాయ సలహాదారుడు అయిన నిరంజన్‌రెడ్డి. దీంతో అయన ద్వారా కూడా జగన్ ఈ ఫంక్షన్ కి వచ్చే అవకాశం ఉంది. ఇక జగన్ కి ఏపీలో పూర్తి వ్యతిరేకంగా ఉన్న పవన్ తన ‘భీమ్లా నాయక్’ సినిమా ఈవెంట్ ని హైదరాబాద్ లో నిర్వహించి దానికి ముఖ్య అతిధిగా KTR ని పిలిచారు. తెలంగాణ ప్రభుత్వాన్ని, KCR, KTRలని ఈ ఈవెంట్ లో అభినందించారు. దీనిపై ఏపీ ప్రభుత్వంలోని కొంతమంది మంత్రులు వ్యతిరేకంగా కూడా మాట్లాడారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం మళ్ళీ సినీ పరిశ్రమకి ఇబ్బందులు పెట్టకూడదని, ఉన్న ఈ ఛాన్స్ ని వినియోగించుకోవాలని చిరంజీవి భావిస్తున్నారు. అందుకే ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏపీలో పెట్టి జగన్ ని ముఖ్య అతిధిగా పిలవాలని భావిస్తున్నట్టు సమాచారం.

విజయవాడ సిద్దార్ట్ఘ కాలేజీలో కానీ, నాగార్జున యూనివర్సిటీ వద్ద కానీ ఈ ఈవెంట్ నిర్వహించే అవకాశం ఉందని, త్వరలోనే దీనిపై అధికారిక వివరాలు ప్రకటిస్తామని చిత్ర నిర్మాతలు తెలిపారు.