మేము సైతం : జగపతి బాబు నిత్యావసర సరుకుల పంపిణీ 

  • Published By: madhu ,Published On : May 25, 2020 / 10:06 AM IST
మేము సైతం : జగపతి బాబు నిత్యావసర సరుకుల పంపిణీ 

లాక్ డౌన్ సందర్భంగా ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేక , సినిమా నిర్మాణపు పనులు లేకుండా ఇబ్బంది పడుతున్న సినిమా రంగంలోని మహిళలకు, లైట్ మన్ లకు ప్రముఖ నటుడు జగపతి బాబు నిత్యావసర  సరుకులు, మాస్క్ లు పంపిణీ చేశారు. 400 మంది సినిమా కార్మికులకు బియ్యం, పప్పులు, నూనె తదితర వస్తువులు జగపతి బాబు అందించారు. ఈ కార్యక్రంలో ప్రొడక్షన్ మేనేజర్, భారతీయ జనతా పార్టీ నాయకుడు చంద్ర మధు, జగపతి బాబు మేనేజర్ మహేష్, సహాయకుడు రవి తదితరులు పాల్గొన్నారు. 

కరోనా వల్ల జనాలు రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఆదుకోవడానికి మేము సైతం అంటూ ముందుకు వస్తున్నారు ఫిల్మ్ స్టార్. డబ్బున్నవారు వారి చేతనైన సాయం చేస్తుంటే.. మరికొంత మంది స్టార్ తమ విలువైన వస్తువులను వేలం వేసి.. వచ్చిన డబ్బులతో కరోనా వల్ల ఎఫెక్ట్ అయిన వారిని ఆదుకుంటున్నారు. కరోనా ఎఫెక్ట్ తో చాలా మంది రోడ్డున పడ్డారు. కార్మికులు.. రోజువారి కూలీలు.. ఇన్ కమ్ లేక.. తిండి లేక ఇబ్బంది పడుతున్న వారికి ఫిల్మ్ స్టార్స్ కూడా తమ వంతూ ఓ చేయి వేస్తున్నారు. తమ మెమరబుల్ గా దాచుకున్న వస్తువులను వేలం వేసి మరీ.. వచ్చిన డబ్బుతో కరోనా ఫండ్స్ ను కలెక్ట్ చేస్తున్నారు.

మరోవైపు లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగులు, రీ ప్రొడక్షన్లను దశల వారీగా పునరుద్ధరిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ నిబంధనలు, కోవిడ్ వ్యాప్తి నివారణ మార్గదర్శకాలు పాటిస్తూ షూటింగులు నిర్వహించేలా ఎవరికి వారు నియంత్రణ పాటించాల్సి ఉంటుందని సూచించారు. సినిమా షూటింగులు ఎలా నిర్వహించుకోవాలనే విషయంలో విధి విధానాలు రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

Read: మహేష్ బాబు పాటలో మాటకు.. వార్నర్ మాయమైపోయాడు