Jagapathi Babu: బాలీవుడ్‌లో జగ్గూభాయ్ ఎంట్రీ.. ఇక గర్జనే!

జగపతి బాబు అంటే ఒకప్పుడు శోభన్ బాబు తర్వాత రొమాంటిక్ హీరో. అందుకే ఇప్పటికే జగ్గుభాయ్ కు లేడీ ఫాలోయింగ్ ఎక్కువే. అయితే.. యంగ్ హీరోలు రాజ్యమేలుతున్న రోజుల్లో జేబీకి ఆశించిన..

Jagapathi Babu: బాలీవుడ్‌లో జగ్గూభాయ్ ఎంట్రీ.. ఇక గర్జనే!

Jagapathi Babu

Jagapathi Babu: జగపతి బాబు అంటే ఒకప్పుడు శోభన్ బాబు తర్వాత రొమాంటిక్ హీరో. అందుకే ఇప్పటికీ జగ్గుభాయ్ కు లేడీ ఫాలోయింగ్ ఎక్కువే. అయితే.. యంగ్ హీరోలు రాజ్యమేలుతున్న రోజుల్లో జేబీకి ఆశించిన విజయాలు దక్కడంలేదు. అప్పుడే లెజెండ్ రూపంలో దర్శకుడు బోయపాటి విలన్ గా జగపతిలో మరో యాంగిల్ వెలికితీశాడు. నటనంటే ఊగిపోయే జగపతి విలన్ గా మెప్పించిన తీరుకు మరోసారి తెలుగు ఇండస్ట్రీ దాసోహమైంది.

Hari Hara Veera Mallu: పవన్ రాక మరింత ఆలస్యం.. కారణం ఏంటంటే?

కేవలం విలన్ పాత్రలకే కాకుండా పాత్ర నచ్చితే హీరో, హీరోయిన్ల తండ్రిగా కూడా జగపతి అదరగొడుతూ దూసుకుపోతున్నాడు. కేవలం తెలుగులో కాదు, తమిళ, కన్నడ, మలయాళం ఇలా సౌత్ మొత్తం చుట్టేస్తున్నాడు. ప్రస్తుతం జగపతి చేతిలో పదికిపైగా సినిమాలున్నాయి. అందుకో కూడా రజనీ కాంత్ అన్నాత్తై, పుష్ప, సలార్, గని లాంటి క్రేజీ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఒకవిధంగా సౌత్ అన్ని ఇండస్ట్రీలలో జగపతి ఇప్పుడు ఫుల్ బిజీ యాక్టర్. అయితే.. ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకి కూడా ముహూర్తం పెట్టేసినట్లు తెలుస్తుంది.

Telugu Young Hero’s: ఒక్క బ్రేక్.. ఒక్క హిట్టు కావాలి ప్లీజ్!

హిందీలో అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో ఫర్హాన్ అక్తర్ హీరోగా ‘పుకార్’ అనే సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో మెయిన్‌ విలన్‌ కోసం జగ్గుభాయ్‌కి పిలుపు వచ్చినట్టు తెలుస్తుంది. నిజానికి జగపతికి బాలీవుడ్ నుండి ఎప్పుడో భారీ ఆఫర్లు వచ్చాయి. కానీ, హిందీ సినిమాల్లో నటించే ఆసక్తి లేకపోవడంతో ఇన్ని రోజులు నో చెబుతూ వచ్చిన జగ్గుభాయ్.. ఇప్పుడు మాత్రం బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయిపోయినట్టు తెలుస్తుంది. ఇదే నిజమైతే ఇకపై బాలీవుడ్ లో కూడా జగ్గూభాయ్ గర్జన మొదలవడం ఖాయంగా కనిపిస్తుంది.