Jai Balayya Song : జై బాలయ్య.. జైజై బాలయ్య.. అదరగొట్టిన వీరసింహరెడ్డి.. వైరల్ అవుతున్న తమన్ స్టెప్పులు..

తాజాగా ఈ సినిమా నుంచి బాలయ్య మాస్ ఆంతం అని సాంగ్ ని విడుదల చేశారు. సినిమాలో బాలయ్య క్యారెక్టర్ ని పొగుడుతూ జై బాలయ్య జై జై బాలయ్య అని మాస్ బీట్ లో ఉంది ఈ సాంగ్. ఈ పాటతో అభిమానులకి.............

Jai Balayya Song : జై బాలయ్య.. జైజై బాలయ్య.. అదరగొట్టిన వీరసింహరెడ్డి.. వైరల్ అవుతున్న తమన్ స్టెప్పులు..

Jai Balayya Song :  బాలకృష్ణ హీరోగా, శృతి హాసన్ హీరోయిన్ గా మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా వీరసింహ రెడ్డి. బాలకృష్ణ 108వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తునారు. ఇప్పటికే షూటింగ్ చివరిదశలో ఉన్న ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తారని ప్రకటించారు.

తాజాగా ఈ సినిమా నుంచి బాలయ్య మాస్ ఆంతం అని సాంగ్ ని విడుదల చేశారు. సినిమాలో బాలయ్య క్యారెక్టర్ ని పొగుడుతూ జై బాలయ్య జై జై బాలయ్య అని మాస్ బీట్ లో ఉంది ఈ సాంగ్. ఈ పాటతో అభిమానులకి మంచి జోష్ వచ్చింది. తమన్ సంగీత దర్శకత్వంలో కరీముల్లా ఈ పాటని పాడాడు. రామజోగయ్య శాస్త్రి పాటని రచించారు.

Allari naresh : పవన్ కళ్యాణ్ పార్టీపై, రాజకీయాలపై స్పందించిన నరేష్..

అయితే ఈ లిరికల్ వీడియోలో సాంగ్ కంటే కూడా తమన్ అదరగొట్టాడు. ఇటీవల తమన్ స్వరపరిచే అన్ని లిరికల్ వీడియోల్లో కనిపిస్తూ హంగామా చేస్తున్నాడు. ఈ పాటలో కూడా తమన్ వైట్ అండ్ వైట్ డ్రెస్ లో గోల్డ్ తగిలించి ఊర మాస్ స్టెప్పులు వేస్తూ, డప్పులు కొడుతూ హడావిడి చేశాడు. దీంతో సాంగ్ తో పాటు తమన్ మాస్ స్టెప్పులు కూడా వైరల్ అవుతున్నాయి.