Jailer Movie: రాజస్థాన్‌లో ఛేజింగ్ చేస్తోన్న జైలర్.. ఫోటోలు లీక్!

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘జైలర్’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు నెల్సన్ దిలీప్ తెరకెక్కిస్తుండగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రాజస్థాన్‌లో జరుగుతోంది.

Jailer Movie: రాజస్థాన్‌లో ఛేజింగ్ చేస్తోన్న జైలర్.. ఫోటోలు లీక్!

Jailer Movie Action Sequence Pics Leaked

Jailer Movie: కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘జైలర్’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు నెల్సన్ దిలీప్ తెరకెక్కిస్తుండగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రాజస్థాన్‌లో జరుగుతోంది.

Jailer Movie: ‘జైలర్’తో రొమాన్స్ కు మిల్కీ బ్యూటీ సై!

అయితే ఈ సినిమాకు లీకుల బెడద తప్పడం లేదు. ఈ సినిమాలోని నటీనటులకు సంబంధించిన పోస్టర్స్ చిత్ర యూనిట్ ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ వచ్చింది. కాగా, తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ప్రస్తుతం జరుగుతున్న యాక్షన్ సీక్వెన్స్‌లకు సంబంధించి పలు ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ యాక్టర్ జాకీ ష్రాఫ్, మలయాళం నటుడు మోహన్ లాల్ ఈ సెట్స్‌లో ఉన్న ఫోటోలు, బోల్తా పడిన జీపుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Jailer Movie: జైలర్ మూవీలో జాయిన్ అయిన మంగళం శ్రీను!

ఇలా సినిమా షూటింగ్ సెట్స్ నుండి ఫోటోలు లీక్ అవుతుండటంతో చిత్ర యూనిట్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇకపై ఈ సినిమా సెట్స్ నుండి ఎలాంటి ఫోటోలు లీక్ కాకుండా ఉండేలా జాగ్రత్తపడాలని చిత్ర యూనిట్ చూస్తోంది. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తోండగా, శివరాజ్ కుమార్, రమ్యకృష్ణ, యోగిబాబు, సునీల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు.