James Camaron : ‘అవతార్ 2’లో పది నిమిషాల సీన్స్ కట్ చేసిన జేమ్స్ కామెరూన్..

అవతార్ 2 సినిమా దాదాపు 3 గంటలకి పైగా నిడివి ఉంది. ఇంత లెంగ్త్ ఉండటం, కొన్ని చోట్ల బోరింగ్ గా సాగే అంశాలు ఉండటంతో సినిమాకి మైనస్ కూడా అయింది. తాజాగా సినిమా నిడివి నుంచి పది నిముషాలు కట్ చేశాము అని దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెలిపారు..............

James Camaron : ‘అవతార్ 2’లో పది నిమిషాల సీన్స్ కట్ చేసిన జేమ్స్ కామెరూన్..

James Camaron cut the ten minutes scenes in Avatar 2

James Camaron :  ప్రపంచమంతా ఇటీవల ఎదురు చూసిన సినిమా అవతార్ 2. అవతార్ రిలీజైన పదేళ్లకు అవతార్ 2 రిలీజయింది. డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా భారీగా థియేటర్స్ లో రిలీజయింది ఈ సినిమా. అవతార్ 2 మంచి విజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 1 బిలియన్ డాలర్స్ పైగా కలెక్షన్స్ ని సాధించింది. సినిమా విజువల్స్ పరంగా అద్భుతంగా ఉన్నా కథ సాధారణ కథే కావడం విశేషం. ఇక్కడ తెలుగు ప్రేక్షకులకి అయితే సినిమా మామూలుగానే అనిపించింది. కేవలం విజువల్స్, గ్రాఫిక్స్ కోసమే ఈ సినిమాని చూశామని చెప్పారు ప్రేక్షకులు.

అయితే అవతార్ 2 సినిమా దాదాపు 3 గంటలకి పైగా నిడివి ఉంది. ఇంత లెంగ్త్ ఉండటం, కొన్ని చోట్ల బోరింగ్ గా సాగే అంశాలు ఉండటంతో సినిమాకి మైనస్ కూడా అయింది. తాజాగా సినిమా నిడివి నుంచి పది నిముషాలు కట్ చేశాము అని దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెలిపారు. ఇటీవల ఓ హాలీవుడ్ ప్రెస్ మీట్ లో అవతార్ 2 దర్శకుడు జేమ్స్ కామెరూన్ మాట్లాడుతూ.. వయొలెన్స్, గన్ ఫైటింగ్ దృశ్యాలని తగ్గించాలనే ఉద్దేశంతో సినిమాలోని ఓ పది నిమిషాల సన్నివేశాల్ని కట్ చేశాం. కీలకమైన యాక్షన్ సీన్స్ ని కట్ చేయాలంటే డైరెక్టర్ చాలా ఆలోచిస్తాడు. కానీ యాక్షన్ సీన్స్ ఎక్కువై ప్రేక్షకుడికి బోర్ కొట్టకూడదని తగ్గించాము అని తెలిపాడు.

Manushi Chhillar : రాజమౌళి సినిమాలో నటించాలని ఉందన్న మాజీ ప్రపంచ సుందరి..

దీంతో అవతార్ 2 ప్రస్తుతం పది నిముషాలు నిడివి తగ్గి స్క్రీన్ అవుతుంది. అయితే పోరాట సన్నివేశాల బదులు కథలో సాగతీత సన్నివేశాల్ని కట్ చేస్తే బాగుండేదని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే 1.3 బిలియన్ డాలర్స్ కలెక్షన్స్ రాగా 2 బిలియన్ డాలర్స్ టార్గెట్ పెట్టుకున్నారు చిత్ర యూనిట్.