Avatar 3 : అవార్డుల వేదికపై అవతార్-3 కథ చెప్పిన జేమ్స్ కామెరూన్.. భూమి, నీరు, నెక్స్ట్?

దర్శకుడు జేమ్స్ కామెరూన్ అవతార్-1 ని పాండోరా గ్రహంలో భూమి మీద చిత్రీకరిస్తే, సీక్వెల్ ని వాటర్ లో చూపించాడు. ఇప్పుడు మూడు భాగం ఏ నేపథ్యంతో చూపించబోతున్నాడు అంటూ అందరిలో ఆశక్తి నెలకుంది. తాజాగా ఈ విషయం గురించి దర్శకుడు తెలియజేశాడు.

Avatar 3 : అవార్డుల వేదికపై అవతార్-3 కథ చెప్పిన జేమ్స్ కామెరూన్.. భూమి, నీరు, నెక్స్ట్?

avatar 3

Avatar 3 : దాదాపు దశాబ్దం కాలం క్రిందట హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ‘అవతార్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏళ్ళ తరబడి జేమ్స్ కామెరూన్ కన్న కలని ప్రేక్షకుల కళ్ళకు గట్టినట్లు చూపించడంతో అందరూ అబ్బుర పోయారు. ‘పాండోర’ ప్రపంచాన్ని వెండితెర పై దర్శకుడు సృష్టించిన తీరు ఆడియన్స్ ని సినిమా చూస్తునంత సేపు ఆ ప్రపంచంలో విహరించేలా చేసింది. విజువల్ వండర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా అద్భుతమైన విజయాన్ని, కలెక్షన్స్ ని అందుకుంది.

Avatar 2: బిలియన్ డాలర్ మార్క్‌తో సెన్సేషన్ క్రియేట్ చేయనున్న అవతార్ 2!

ఇక ఈ సినిమాకి సీక్వెల్స్ తీసుకు వస్తాను అంటూ ప్రకటించిన జేమ్స్ ఇటీవలే అవతార్-2 ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. ‘అవతార్‌ ద వే ఆఫ్‌ వాటర్‌’ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సీక్వెల్ సముద్ర గర్భ అందాలతో ఆకట్టుకుంది. మొత్తం ఈ సీక్వెల్స్ లో 5 సినిమాలు వస్తాయంటూ దర్శకుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా మొదటి భాగంలో కథ పాండోరా గ్రహంలో భూమి మీద జరిగితే, రెండో భాగం కథ నీళ్ళల్లో జరిగింది. దీంతో ఇప్పుడు మూడో భాగం కథ ఏ నేపథ్యంతో సాగుతుంది అంటూ అందిరిలో ఆశక్తి నెలకుంది.

తాజాగా దీనిపై జేమ్స్ కామెరూన్ అప్డేట్ ఇచ్చాడు. క్రిటిక్ ఛాయస్ అవార్డ్స్ లో బెస్ట్ విజువల్‌ ఎఫెక్ట్‌ కేటగిరిలో అవతార్-2 సినిమా అవార్డుని అందుకుంది. ఇక ఈ అవార్డుల కార్యక్రమానికి వచ్చిన జేమ్స్ కామెరూన్ అవతార్-3 గురించి మాట్లాడుతూ.. ‘అవతార్-3 అగ్ని నేపథ్యంతో రాబోతుంది. పాండోర గ్రహంలోని మరో ప్రాంతంలో ఈ కథ కొనసాగుతుంది. ఈ సినిమాలో కొత్త తెగల, కొత్త సంసృతిని పరిచయం చేస్తాం’ అంటూ తెలియజేశాడు. ఇదే వేదిక పై ఉన్న జేమ్స్ కామెరూన్ భార్య మాట్లాడుతూ.. ‘మీ అంచనాలకు మించి అవతార్-3 ఉండబోతుంది’ అంటూ వ్యాఖ్యానించింది. కాగా హాలీవుడ్ మీడియాలో అవతార్-3 కథ ‘మండే’ అనే ఎడారిలో సాగుతుంది అంటూ కథనాలు వస్తున్నాయి. ఇక ఈ సినిమా 2024 డిసెంబర్ లో రిలీజ్ కానుంది.