కరోనాకే పిచ్చెక్కించేలా పాడారుగా! పాట వింటే పారిపోవడం ఖాయం..

కరోనాపై ప్రముఖ కమెడియన్ జానీ లెవర్, రచయిత జొన్నవిత్తుల రూపొందించిన పాటలు ఆకట్టుకుంటున్నాయి..

  • Published By: sekhar ,Published On : April 10, 2020 / 01:47 PM IST
కరోనాకే పిచ్చెక్కించేలా పాడారుగా! పాట వింటే పారిపోవడం ఖాయం..

కరోనాపై ప్రముఖ కమెడియన్ జానీ లెవర్, రచయిత జొన్నవిత్తుల రూపొందించిన పాటలు ఆకట్టుకుంటున్నాయి..

కరోనా మహమ్మారిని అరికట్టడానికి ప్రభుత్వాలు, అధికారులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైన సామాన్యులు, సెలబ్రిటీలు కరోనాపై పలు పాటలు కట్టి ఆకట్టుకుంటున్నారు. తాజాగా కామెడీ కింగ్ జానీ లెవెర్ కరోనాపై పాడిన పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆయనే స్వయంగా పాడిన ఈ పాట.. కరోనాకే పిచ్చిపట్టించేలా ఉంది. దానికి చెవులుండి వింటే పారిపోయేలా ఉంది.

‘‘కరోనా కరోనా నీకు ఏడుపు మొదలైంది. పరిగెత్తుకుంటూ పోతావు.. నీళ్లు కూడా అడగలేవు. ఇండియాలోకి వచ్చి పెద్ద తప్పు చేశావు. ఇక్కడికి వస్తే నీ అమ్మమ్మ కూడా చచ్చిపోతుంది.. ఎందుకంటే ఇది భారతదేశం. మేము ఇంట్లోనే ఉండి నిన్ను పరుగులు పెట్టిస్తాం. నువ్వు బయటే ఉండి కుళ్లిపోతావు. నీ చేతికి దొరకం మేము. నిన్ను అంతమొందించేది మేమే. నీ పీక పిసికేస్తాం.. ఇది భారతదేశం..’’ అంటూ కరోనాకి వార్నింగ్ ఇచ్చే పదాలతో జానీ లెవెర్ ఈ పాటను ఆలపించారు.

Read Also : అఖిల భారత తాగుబోతుల తరపున తెలుగు రాష్ట్రాల సీఎంలకు వర్మ విజ్ఞప్తి..

అలాగే ప్రముఖ రచయిత జొన్నవిత్తుల కూడా కరోనాపై తనదైన శైలిలో పాట రూపొందించారు. అలవోకగా అర్థమయ్యే పదాలతో ఆకట్టుకునేలా ఆలపించారు. ‘‘వచ్చారో చచ్చారే బయటకి.. కనుక  గడపదాటి రావొద్దు దేనికీ.. హద్దు దాటితే కరోనా ఐ లవ్యూ చెబుతాది.. డెత్ బెడ్ మీద నీతో డేటింగ్ చేస్తాది.. హనీమూన్‌కి నిన్ను హెల్‌కి తీసుకెళ్తాది..’’ అంటూ జొన్నవిత్తుల కరోనాపై కట్టిన పాట ఆకట్టుకుంటోంది.