Jamuna : ఈరోజే జమున అంత్యక్రియలు.. అంత్యక్రియలు చేసేది కొడుకు కాదు?

ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి మహానటుల సరసన నటించి అలరించిన విలక్షణ నటి 'జమున' ఈరోజు ఉదయం 7 గంటలకు హైదరాబాద్ లోని తన స్వగృహంలో కన్నుమూశారు. ఆమె అంత్యక్రియలు ఈరోజే జరగనున్నాయి. అయితే..

Jamuna : ఈరోజే జమున అంత్యక్రియలు.. అంత్యక్రియలు చేసేది కొడుకు కాదు?

Jamuna : తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి మహానటుల సరసన నటించి అలరించిన విలక్షణ నటి ‘జమున’ ఈరోజు ఉదయం 7 గంటలకు హైదరాబాద్ లోని తన స్వగృహంలో కన్నుమూశారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కలిపి దాదాపు 200కు పైగా సినిమాలో నటించింది జమున. ఇక ఆమె హఠాన్మరణం గురించి తెలుసుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం జగన్, చిరంజీవి, ఎన్టీఆర్, బాలకృష్ణ తదితరులు తమ విచారం వ్యక్తం చేశారు.

Jamuna Issue with NTR & ANR : జమునని బాయ్‌కాట్ చేసిన ఎన్టీఆర్, ఏఎన్నార్.. సారీ చెప్పమంటే తగ్గేదేలే అన్న జమున..

కాగా ఆమె అంత్యక్రియలు ఈరోజే జరగనున్నాయి. హైదరాబాద్ మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. జమునకి ఇద్దరు పిల్లలు. వారిలో కూతురు హైదరాబాద్ లోనే ఉండగా, కుమారుడు అమెరికాలో ఉంటున్నాడు. అతడు హైదరాబాద్ చేరుకోడానికి మరెంత లేటు అయ్యే అవకాశం ఉండడంతో, కుమార్తె స్రవంతి అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. మధ్యాహ్నం 2 గంటలకి ఆమె భౌతికకాయాన్ని అంతిమయాత్రగా ఫిలిం ఛాంబర్ వద్దకు అభిమానులు మరియు ప్రముఖుల సందర్శనార్థం కోసం తరలించనున్నారు.

Jamuna : సినిమాలు, రాజకీయాలు, సమాజంలో ఎంతో సేవ.. అయినా కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదని జమున ఆవేదన..

సాయంత్రం 5 గంటల వరకు ఆమె పార్ధివదేహాన్ని అక్కడే ఉంచనున్నారు. పలువురు సినీ ప్రముఖులు ఫిలిం ఛాంబర్ లోనే ఆమెకు ఘన నివాళ్లు అర్పించనున్నారు. కాగా జమున సినీ రంగంలోనే కాదు రాజకీయ రంగంలో మరియు పలు సేవా కార్యక్రమాలు చేసి ‘ప్రజానటి’ అని బిరుదుని సంపాదించుకుంది. జమున తన కెరీర్ లో ఫిలింఫేర్ అవార్డులు, స్టేట్ అవార్డులు, ఎన్టీఆర్ నేషనల్ అవార్డు, పలు స్థానిక అవార్డుని గెలుచుకుంది. అయితే సినీ, రాజకీయ పరంగా ఎన్నో సేవలు అందించిన జమునని భారత ప్రభుత్వం ఎటువంటి పురస్కారంతో గౌరించలేదు. అందుకు ఆమె కూడా ఏమి బాధ పడలేదు అంటూ ఎన్నో సార్లు చెప్పుకొచ్చింది.