Janhvi Kapoor : శ్రీదేవి కూతురా.. మజాకా.. పెళ్లి గురించి ఓపెన్ అయ్యిందిగా..!

శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ పెళ్లి గురించి తన మనసులో మాట చెప్పింది..

Janhvi Kapoor : శ్రీదేవి కూతురా.. మజాకా.. పెళ్లి గురించి ఓపెన్ అయ్యిందిగా..!

Janhvi Kapoor (image:instagram)

Janhvi Kapoor: శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ పెళ్లి గురించి తన మనసులో మాట చెప్పింది. కాబోయే భర్త, బ్యాచిలర్ పార్టీ, మెహందీ, సంగీత్, పెళ్లి, పెళ్లికి ధరించే చీరతో పాటు ఏ ఫంక్షన్ ఎక్కడ జరుపుకోవాలనుకుంటుందో కూడా వివరంగా చెప్పుకొచ్చింది.

Janhvi Kapoor : గ్లామర్ డోస్ డబుల్ చేసిన జాన్వీ కపూర్..

‘కాబోయే భర్త తెలివిగలవాడైతే చాలు.. పెళ్లి తతంగమంతా మూడే రోజుల్లో ముగించెయ్యాలి. కాప్రీ ఐలాండ్‌లో నా గ్యాంగ్‌తో కలిసి ఓ ప్రైవేట్ బోట్‌లో బ్యాచిలర్ పార్టీ ఎంజాయ్ చెయ్యాలి. తర్వాత తిరుపతిలో పెళ్లి చేసుకోవాలి. చైన్నైలోని మైలాపూర్‌లో అమ్మ నివసించిన ఇంటిలో మెహందీ, సంగీత్ ఫంక్షన్లు జరుపుకోవాలి. అలాగే పెళ్లికి ట్రెడిషనల్ శారీ కట్టుకోవాలనేది నా కోరిక’.. అంటూ తన డ్రీమ్ వెడ్డింగ్ గురించి చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్.

Janhvi Kapoor : ఆంటీతో కలిసి డ్యాన్స్ అదరగొట్టిన జాన్వీ..

‘ఈ రోజుల్లో సెలబ్రిటీలంతా డెస్టినేషన్ వెడ్డింగ్ అంటూ విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకుంటుంటే.. జాన్వీ మాత్రం పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో పెళ్లి చేసుకోవాలనుకోవడం, సంప్రదాయంగా చీర కట్టుకోవాలనుకోవడం గ్రేట్’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల హారర్ కామెడీ ‘రూహీ’ తో ఆకట్టుకున్న జాన్వీ ప్రస్తుతం ‘దోస్తానా 2’, ‘గుడ్ లక్ జెర్రీ’ సినిమాలు చేస్తోంది.

Arjun Kapoor : చెల్లెళ్ళతో రిలేషన్ గురించి అర్జున్ కపూర్ కామెంట్స్..