Janhvi Kapoor : NTR 30 కంటే ముందే.. తెలుగు హీరోలతో నటించిన జాన్వీ.. మూడు రోజుల్లో రిలీజ్.. సర్‌ప్రైజ్ ఇచ్చిన నెట్‌ఫ్లిక్స్..

సోమవారం (మార్చ్ 6) నాడు జాన్వీ కపూర్ పుట్టిన రోజు కావడంతో NTR 30 టీం సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చింది. NTR30 సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుందని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. దీంతో తెలుగు జాన్వీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు. అయితే సోమవారం సాయంత్రానికి నెట్ ఫ్లిక్స్ మరో సర్ ప్రైజ్....................

Janhvi Kapoor : NTR 30 కంటే ముందే.. తెలుగు హీరోలతో నటించిన జాన్వీ.. మూడు రోజుల్లో రిలీజ్.. సర్‌ప్రైజ్ ఇచ్చిన నెట్‌ఫ్లిక్స్..

Janhvi Kapoor act with rana for rana naidu series promotions netflix released a video

Janhvi Kapoor :  అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు, బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ఎప్పుడెప్పుడు సౌత్ లో అడుగుపెడుతుందా, ఎప్పుడు తెలుగులో సినిమాలు చేస్తుందా, ఎప్పుడు మన తెలుగు హీరోలతో నటిస్తుందా అని శ్రీదేవి ఫ్యాన్స్, సౌత్ జాన్వీ ఫ్యాన్స్ ఎదురుచూశారు. ఇక జాన్వీ కూడా పలు సందర్భాల్లో సౌత్ సినిమాల్లో నటిస్తానని, ముఖ్యంగా ఎన్టీఆర్ కి అభిమానిని అని, ఎన్టీఆర్ సినిమాలో ఆఫర్ వస్తే కచ్చితంగా నటిస్తానని గతంలో ప్రకటించింది. ఎన్టీఆర్ 30వ సినిమాలో జాన్వీ నటిస్తుందని వార్తలు కూడా వచ్చాయి.

తాజాగా సోమవారం (మార్చ్ 6) నాడు జాన్వీ కపూర్ పుట్టిన రోజు కావడంతో NTR 30 టీం సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చింది. NTR30 సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుందని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. దీంతో తెలుగు జాన్వీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు. అయితే సోమవారం సాయంత్రానికి నెట్ ఫ్లిక్స్ మరో సర్ ప్రైజ్ ఇచ్చింది. వెంకటేష్, రానా కలిసి రానా నాయుడు అనే సిరీస్ లో నటిస్తున్నారు. ఈ సిరీస్ ని భారీగా నెట్ ఫ్లిక్స్ నిర్మించింది. మార్చ్ 10 నుంచి నెట్ ఫ్లిక్స్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవ్వనుంది. పాన్ ఇండియా సిరీస్ లా పలు భాషల్లో దీన్ని రిలీజ్ చేయనున్నారు నెట్ ఫ్లిక్స్.

Sarpatta 2 : సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ ప్రకటించిన ఆర్య.. సార్పట్ట 2 అనౌన్స్..

రానా నాయుడు సిరీస్ లో రానా బాలీవుడ్ సెలబ్రిటీలకు ఎటువంటి ప్రాబ్లమ్ వచ్చినా సాల్వ్ చేసే పాత్రలో కనిపించబోతున్నాడు. తాజాగా జాన్వీ పుట్టిన రోజు కావడంతో రానా నాయుడు నుంచి ఓ స్పెషల్ ప్రోమో రిలీజ్ చేశారు. జాన్వీకి ఏదో ప్రాబ్లమ్ వస్తే రానా వచ్చి హెల్ప్ చేసినట్టు ఈ ప్రోమోలో చూపించారు. ఈ ప్రోమో కొంచెం కామెడిగానే ఉంది. దీంతో ఇది రానా నాయుడు ప్రమోషన్స్ కోసం చేశారా? లేక నిజంగానే జాన్వీ రానా నాయుడు సిరీస్ లో గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వనుందా అని అభిమానులు ఆలోచిస్తున్నారు. ఇప్పటికే వెంకటేష్, రానా కలిసి నెగిటివ్ షేడ్స్ లో నటిస్తుండటంతో రానా నాయుడు సిరీస్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇపుడు నెట్ ఫ్లిక్స్ రిలీజ్ చేసిన జాన్వీ వీడియోతో ఈ సిరీస్ పై మరిన్ని అంచనాలు పెరిగాయి. మొత్తానికి జాన్వీ ఎన్టీఆర్ 30 కంటే ముందు రానాతో కలిసి రానా నాయుడు కోసం నటించేసింది.

View this post on Instagram

A post shared by Netflix India (@netflix_in)