Janhvi Kapoor: ఊరించి.. ఉసూరుమనిపించిన జాన్వీ.. సౌత్‌లో సినిమా లేనట్టేనా..?

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హిందీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోవడంలో సక్సెస్ అయ్యింది. శ్రీదేవి, బోనీ కపూర్‌ల కూతురిగా ఇండస్ట్రీకి పరిచయమైనా, తన యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. బాలీవుడ్‌లో పలు సక్సెస్ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ, ఇటీవల సౌత్ సినిమాలపై కన్నేసిందని బి-టౌన్‌లో వార్తలు జోరుగా వినిపించాయి.

Janhvi Kapoor: ఊరించి.. ఉసూరుమనిపించిన జాన్వీ.. సౌత్‌లో సినిమా లేనట్టేనా..?

Janhvi Kapoor Did Not Sign South Film

Janhvi Kapoor: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హిందీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోవడంలో సక్సెస్ అయ్యింది. శ్రీదేవి, బోనీ కపూర్‌ల కూతురిగా ఇండస్ట్రీకి పరిచయమైనా, తన యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. బాలీవుడ్‌లో పలు సక్సెస్ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ, ఇటీవల సౌత్ సినిమాలపై కన్నేసిందని బి-టౌన్‌లో వార్తలు జోరుగా వినిపించాయి.

Janhvi Kapoor: సౌత్ నిర్మాతలకు చుక్కలు చూపెడుతున్న జాన్వీ కపూర్.. ఒక్క సినిమా కూడా చేయకుండానే..?

దానికి తగ్గట్టుగానే జాన్వీ కూడా తనకు సౌత్ సినిమాలపై ఆసక్తి ఉందంటూ కామెంట్ చేయడంతో ఈ బ్యూటీ ఇక్కడ ఎంట్రీ ఇవ్వడం ఖాయమని అందరూ అనుకున్నారు. అంతేగాక, సౌత్‌లో ఇప్పటికే ఈ బ్యూటీ రెండు భారీ సినిమాలు ఓకే చేసిందనే టాక్ సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. అయితే తాజాగా ఈ వార్తలపై జాన్వీ తండ్రి, నిర్మాత బోనీ కపూర్ క్లారిటీ ఇచ్చారు. తన కూతురు ఎలాంటి తమిళ సినిమాలో నటించేందుకు ఒప్పుకోలేదని ఆయన స్పష్టం చేశారు. దీంతో కోలీవుడ్‌లో అమ్మడి ఎంట్రీ లేనట్టే అని తేలిపోయింది.

ఇక టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్‌లో తెరకెక్కనున్న 30వ చిత్రంలో హీరోయిన్‌గా జాన్వీని సెలెక్ట్ చేశారనే టాక్ కూడా వినిపించింది. కానీ, ఈ వార్తలో కూడా ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. జాన్వీని ఈ సినిమా కోసం ఎవరూ సంప్రదించలేదట. దీంతో జాన్వీ కపూర్ సౌత్ ఇండస్ట్రీల్లో ఎంట్రీ ఇస్తుందనే వార్తకు బ్రేక్ పడినట్లే. మరి నిజంగానే ఎన్టీఆర్ 30వ చిత్రంలో జాన్వీ సెలెక్ట్ కాకపోతే, మరెవర్ని ఈ సినిమాలో హీరోయిన్‌గా ఫిక్స్ చేస్తారా అని తారక్ అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.