Janhvi Kapoor: జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్.. రౌడీ హీరోతో రెడీ!

అతిలోక సుందరి కూతురు ఎప్పుడెప్పుడు టాలీవుడ్ లోకి అరంగేట్రం చేస్తోందో అని అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తెలుగులో మంచి క్రేజ్ ఉన్న జాన్విని ఎప్పుడెప్పుడు తెలుగు స్క్రీన్ మీద..

Janhvi Kapoor: జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్.. రౌడీ హీరోతో రెడీ!

Janhvi Kapoor

Janhvi Kapoor: అతిలోక సుందరి కూతురు ఎప్పుడెప్పుడు టాలీవుడ్ లోకి అరంగేట్రం చేస్తోందో అని అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తెలుగులో మంచి క్రేజ్ ఉన్న జాన్విని ఎప్పుడెప్పుడు తెలుగు స్క్రీన్ మీద చూస్తామా అని ఆశపడుతున్నారు ఫాన్స్. అయితే ఇన్నాళ్లకు జాన్వి తెలుగు ఎంట్రీ ఫిక్స్ అయ్యింది.

Bheemla Nayak: పవర్ స్టార్ వచ్చేస్తున్నాడు.. థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!

సౌత్ తో పాటు నార్త్ లో కూడా స్టార్ హీరోయిన్ గా ఎదిగిన శ్రీదేవి కూతురు జాన్వికపూర్.. ప్రజెంట్ బాలీవుడ్ హీరోయిన్ అయినా.. సౌత్ కనెక్షన్ ఉండడంతో టాలీవుడ్.. జాన్వీని బాగా ఓన్ చేసుకుంటోంది. అందుకే జాన్వి తెలుగులో హీరోయిన్ గా చేస్తే చూడాలని చాలా మంది ఆశపడుతున్నారు. దానికోసం మేకర్స్ కూడా చాలా రోజుల నుంచి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇన్నాళ్లకి అమ్మడు ఓకే చెప్పింది.

Alekhya Harika: నిలువెల్లా నిషా ఎక్కించేస్తున్న హారికా!

జాన్వి కూడా అప్పుడప్పుడు సౌత్ లో సినిమాలు తప్పకుండా చేస్తానని ఓపెన్ గానే చెబుతోంది. అంతేకాదు.. టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ, ప్రభాస్ తో సినిమాలు చెయ్యడానికి ఇంట్రస్ట్ చూపించింది కూడా. పబ్లిక్ గా తెలుగులో చెయ్యాలని చెప్పిందే లేదో.. మన వాళ్లు జాన్విని టాలీవుడ్ లో ఎంట్రీ ఇప్పించడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు. రీసెంట్ గా విజయ్ దేవరకొండ లైగర్ సినిమాలో హీరోయిన్ గా ఫస్ట్ జాన్వీనే ప్రపోజ్ చేశారు. కానీడేట్స్ అడ్జస్ట్ అవ్వక సినిమా ఛాన్స్ మిస్ అయ్యింది జాన్వీ. అయితే ఇప్పుడు మాత్రం విజయ్ తోనే టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయ్యింది జాన్వి.

Actress Dressing: ట్రోలింగ్.. నెటిజన్స్ చేత తిట్లు తింటున్న స్టార్ హీరోయిన్లు!

జాన్వికపూర్ ని ఎలా అయినా తెలుగులో లాంచ్ చెయ్యాలని ఫస్ట్ నుంచి అనుకుంటున్నారు డైరెక్టర్ పూరీజగన్. లైగర్ కి మిస్ అయినా.. విజయ్ దేవరకొండతో పూరీ చెయ్యబోతున్న నెక్ట్స్ సినిమాలో హీరోయిన్ గా జాన్వీనే ఫిక్స్ చేశారు టీమ్. అంతేకాదు.. ఈ ప్రపోజల్ కి జాన్వి కూడా ఓకే అనడంతో జాన్వి తెలుగు ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్ అయిపోయింది. ఇప్పటికే దీపికా, అనన్య, లాంటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు తెలుగులో సినిమాలు చేస్తున్నారు. దాంతో జాన్వి కూడా తెలుగు ఎంట్రీకి రెడీ అయ్యింది. తెలుగులో నెక్ట్స్ ఇయర్ సెట్స్ మీద కెళ్లబోతున్న ఈ క్రేజీ మూవీతో శ్రీదేవి కూతురు బాలీవుడ్ భామ జాన్వి కపూర్ తెలుగు ఆడియన్స్ ని పలకరించబోతోంది.