స్టైలిష్ స్టార్ స్టెప్స్ కుమ్మేశారు.. జానీ మాస్టర్..

స్టైలిష్ స్టార్ స్టెప్స్ కుమ్మేశారు.. జానీ మాస్టర్..

Jani Master: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ‘పుష్ప’.. రష్మిక మందన్న కథానాయిక.. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

లాక్‌డౌన్ తర్వాత పున:ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. కొద్దిరోజులుగా తమిళనాడులో కీలక సన్నివేశాలతో పాటు జానీ మాస్టర్ నేతృత్వంలో ఓ కిరాక్ సాంగ్ కూడా షూట్ చేశారు. రీసెంట్‌గా లొకేషన్‌లో భోజనం చేస్తున్న పిక్ షేర్ చేశారు జానీ మాస్టర్..

ఈ సాంగ్ బిగ్ స్క్రీన్ మీద ఎప్పుడెప్పుడు చూస్తానా అని చాలా ఎగ్జైటింగ్‌గా ఎదురు చూస్తున్నానని మాస్టర్ చెప్పారు. ఎందుకంటే.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మాంచి కిక్ ఇచ్చే ట్యూన్ కంపోజ్ చేశారట.. దానికి అదిరిపోయే లిరిక్స్, సింగర్స్ వాయిస్ యాడ్ అవడంతో తనకు స్టెప్పులు కంపోజ్ చెయ్యడం ఛాలెంజింగ్‌గా అనిపించిందట.

చాలా బాగా కష్టపడి బన్నీ డ్యాన్సింగ్ స్టైల్‌కి తగ్గట్టు బ్యూటిఫుల్ మూమెంట్స్ క్రియేట్ చేశానని, స్టైలిష్ స్టార్ తన స్టైల్లో కుమ్మేశారని జానీ మాస్టర్ ఈ సాంగ్ గురించి చెబుతున్నారు.. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అల్లు అభిమానులకు ట్రీట్ రెడీ చేస్తున్నారు టీం.. బన్నీ బర్త్‌డేకి ఈ సినిమా టీజర్ రిలీజ్ చెయ్యనున్నారు. ఆగస్టు 13న ‘పుష్ప’ రిలీజవుతోంది.

బన్నీ బర్త్‌డే ట్రీట్ రెడీ చేస్తున్నాడు..