సుబ్బరాజు బర్త్ డేను పండగ్గా చేసుకున్న జపాన్ ఫ్యాన్స్

10TV Telugu News

తెలుగునాట పరిచయం అక్కర్లేని వ్యక్తి సుబ్బరాజు. విలన్ క్యారెక్టర్ లను పోషించే సుబ్బరాజ్ కు మంచి క్రేజ్ ఉంది. తెలుగునాట మాత్రమే సుబ్బరాజుకు క్రేజ్ లేదు. జపాన్ లో కూడా సుబ్బరాజుకు అభామానులు ఉన్నారు. బాహుబ‌లి2 చిత్రంలో కుమార వ‌ర్మ పాత్ర పోషించి అందరిని అల‌రించిన క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ సుబ్బ‌రాజు . సినిమా మొద‌ట్లో అమాయకంగా క‌నిపించి చివ‌రిలో ధైర్యంగా పోరాడ‌డం ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది.

అయితే ఈ పాత్రలో నటించిన సుబ్బరాజుకు జపాన్ అభిమానులు ఫిదా అయిపోయారు. ఎంతగా అంటే సుబ్బరాజు పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకునేంత. ఆ మ‌ధ్య బాహుబ‌లి-2 స్పెష‌ల్ స్క్రీనింగ్ కోసం జ‌ప‌నీస్ సుబ్బరాజుకు ఆహ్వానం ప‌లకగా.. ఆయ‌న ఎంట్రీతో ఆడిటోరియాలు దద్ద‌రిల్లాయి. 
Read Also : నన్ను ఎవడూ.. ఏమీ పీకలేరు : బిగ్ బాస్ కౌశల్ ఉగ్రరూపం

అటువంటి క్రేజ్ దక్కించుకున్న సుబ్బరాజు బ‌ర్త్‌డే(27.02.19) వేడుక‌ల‌ను జపాన్ అభిమానులు కేక్ క‌ట్ చేసి వేడుక జ‌ర‌ప‌డంతో పాటు ప‌లు గిఫ్ట్స్, గ్రీటింగ్స్ ఆయ‌న‌కి పంపారు. వారున్న ప్ర‌తి చోట సుబ్బ‌రాజు ఫోటోల‌ని ఉంచి ఆయ‌న‌పై త‌మ‌కున్న అభిమానాన్ని చాటుకున్నారు. జ‌పాన్‌లో జ‌రిగిన సుబ్బ‌రాజు బ‌ర్త్‌డే వేడుక‌ల‌కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. త‌న‌పై ఇంత ప్రేమ చూపిస్తున్న జ‌పాన్ వాసులకి సుబ్బ‌రాజు సోషల్ మీడియా వేదికగా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌తలు తెలిపారు.
Read Also : దరిద్రం పట్టిస్తున్నావ్ : TikTokకు రూ.40కోట్ల జరిమానా

Read Also : కశ్మీర్ సమస్య కు పరిష్కారం కేసిఆర్ చూపగలరు