‘జాతిరత్నాలు’ : ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్!

ప్రియదర్శి, నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామక‌ృష్ణ మెయిన్ లీడ్స్‌గా.. దర్శకుడు నాగ్ అశ్విన్, స్వప్న సినిమాతో కలిసి నిర్మిస్తున్న కామెడీ ఎంటర్‌టైనర్‌.. ‘జాతిరత్నాలు’ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : October 24, 2019 / 07:56 AM IST
‘జాతిరత్నాలు’ : ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్!

ప్రియదర్శి, నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామక‌ృష్ణ మెయిన్ లీడ్స్‌గా.. దర్శకుడు నాగ్ అశ్విన్, స్వప్న సినిమాతో కలిసి నిర్మిస్తున్న కామెడీ ఎంటర్‌టైనర్‌.. ‘జాతిరత్నాలు’ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్..

సత్ప్రవర్తన వల్ల త్వరగా బయటికొస్తున్నారు మా వాళ్ళు.. ఈ దీపావళికి మీ ‘జాతిరత్నాలు’ అంటున్నారు.. దర్శకుడు నాగ్ అశ్విన్.. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘మహానటి’ సినిమాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న నాగ్ అశ్విన్ నిర్మాతగా మారారు. స్వప్న సినిమాతో కలిసి, ‘జాతిరత్నాలు’ అనే కామెడీ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నారు.

ప్రియదర్శి, నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామక‌ృష్ణ మెయిన్ లీడ్స్‌గా నటించారు. రీసెంట్‌గా ‘జాతిరత్నాలు’ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. ప్రియదర్శి, నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామక‌ృష్ణ ముగ్గురూ ఖైదీ యూనిఫామ్‌లో జైలు నుంచి ఎస్కేప్ అయిన ఆనందంలో విరగబడి నవ్వుతున్న పోస్టర్ ఆకట్టుకుంటుంది.

Read Also : శివ కార్తికేయన్ ‘హీరో’ – టీజర్ 

దీపావళికి ‘జాతిరత్నాలు’ టీజర్ విడుదల కానుంది. సంగీతం : రథన్, కెమెరా : మనోహర్, ఎడిటింగ్ : అభినవ్, కో ప్రొడ్యూసర్ : హర్ష గారపాటి, కథ, కథనం, మాటలు, దర్శకత్వం : అనుదీప్ కె వి.