Jati Ratnalu: జాతి రత్నం రెడీ చేస్తున్న పాన్ మసాలా!!

జాతిరత్నం డైరక్టర్ కేవీ అనుదీప్ మరో హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. పిట్టగోడ సినిమాతో సక్సెస్ చూడలేకపోయిన ఈ యువ డైరక్టర్ కు వైజయంతి మూవీస్ అవకాశం ఇవ్వడంతో జాతిరత్నంతో మెరిసిపోయాడు. అంతే ఈ హిట్ తో ఇండస్ట్రీలోని క్రేజీ డైరక్టర్లలో కలిసిపోయాడు.

Jati Ratnalu: జాతి రత్నం రెడీ చేస్తున్న పాన్ మసాలా!!

Jathi Ratnam (1)

Jati Ratnalu: జాతిరత్నం డైరక్టర్ కేవీ అనుదీప్ మరో హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. పిట్టగోడ సినిమాతో సక్సెస్ చూడలేకపోయిన ఈ యువ డైరక్టర్ కు వైజయంతి మూవీస్ అవకాశం ఇవ్వడంతో జాతిరత్నంతో మెరిసిపోయాడు. అంతే ఈ హిట్ తో ఇండస్ట్రీలోని క్రేజీ డైరక్టర్లలో కలిసిపోయాడు. టాలీవుడ్ లో చాలా మంది హీరోలు అతనితో సినిమా చేయాలని ఆశపడేంతలా ఎదిగిపోయాడు.

అనుదీప్ మాత్రం తమిళ హీరో శివకార్తీకేయన్ తో సినిమా చేద్దామని ఫిక్స్ అయిపోయాడట. నిజానికి ఆయన టార్గెట్ పాన్ ఇండియన్ మూవీ అంట.

తెలుగులో మాస్ రాజా రవితేజలా తమిళ ఇండస్ట్రీలో చిన్న రోల్స్ తో స్టార్ట్ చేసిన శివ కార్తీకేయన్ అంటే తమిళ బ్యాచ్ లో బాగానే క్రేజ్. తమిళ స్టార్లు అయిన ధనుశ్, విజయ్ లాంటి వాళ్లు తెలుగు డైరక్టర్లతో మల్టీ లాంగ్వేజ్ సినిమాలు చేస్తుండగా అనుదీప్.. శివ కార్తీకేయన్ ను అదే జాబితాలో చేరుస్తానంటున్నాడు.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుశ్ నటిస్తున్న సినిమానుఆసియన్ మూవీస్ ప్రొడ్యూస్ చేస్తుండగా.. ధనుశ్ తో జాతి రత్నాలు-2కు అనుదీప్ రెడీ అయ్యాడంటూ రూమర్లు వినిపించాయి. వాటన్నిటినీ కొట్టిపారేస్తూ శివ అనే ప్రాజెక్టును ఫైనల్ చేశారు.

తర్వాతి సినిమాను తెలుగు, తమిళ్, హిందీలో రిలీజ్ చేస్తూ పాన్ ఇండియా లెవల్ లో తీయనున్నారట. ముందు వచ్చిన తన రెండు సినిమాల్లా కాకుండా పూర్తి స్థాయి కమర్షియల్ ఎలిమెంట్స్ తో ప్రాజెక్ట్ రెడీ చేయనున్నారు. ఇక దీనికి సంబంధించి అధికారిక ప్రకటన మాత్రమే వెలువడాల్సి ఉంది.