కామెడి…..విలనిజం రెండూ పండించగల ఏకైక నటుడు జయప్రకాష్ రెడ్డి

  • Published By: murthy ,Published On : September 8, 2020 / 05:06 PM IST
కామెడి…..విలనిజం రెండూ పండించగల ఏకైక నటుడు జయప్రకాష్ రెడ్డి

ఒక కత్తికి రెండు వైపులా పదునుంది అన్నట్లుగా జయప్రకాష్ రెడ్డి ఏ పాత్రలో అయినా ఒదిగిపోయేవారు.  అటు కామెడీ అయినా..ఇటు విలనిజం ఐనా సరే… స్టార్ హీరోలతో తలపడగలిగే విలనిజం, ఏ క్యారెక్టర్ లో అయినా ఒదిగి పోగలిగే పనితనం, ఎదుట ఎంత పెద్ద హీరో ఉన్నా…… తన డైలాగ్స్ తో సీన్ ని తన సొంతం చేసుకోగలిగే ప్రతిభ జయప్రకాష్ రెడ్డి సొంతం.

వేషం, భాష ఏదైనా క్యారెక్టర్ ఎలాంటి దైనా స్క్రీన్ మీద తన ప్రతాపాన్ని చూపించే అద్భుతమైన నటుడు జయప్రకాష్ రెడ్డి గుండెపోటుతో మరణించారు. ఆయన మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటు అంటూ ఆయనతో తమ అనుంబంధాన్ని గుర్తు చేసుకున్నారు చాలా మంది స్టార్లు



74 ఏళ్ల జయప్రకాష్ రెడ్డి పరిచయం అక్కర్లేని పేరు. థియేటర్ ఆర్టిస్ట్ గా మంచి పేరున్న జయప్రకాష్ రెడ్డి ప్రేమించుకుందాం రా సినిమాతో ఫుల్ ఫ్లెడ్జ్ విలన్ గా ప్రేక్షకుల్లో తన స్ధానం సుస్ధిరం చేసుకున్నారు. అంతకుముందు జంబలకిడి పంబ లాంటి సినిమాల్లో రకరకాల క్యారెక్టర్లు చేసినా బాగా పాపులర్ అయ్యింది మాత్రం ప్రేమించుకుందాం రా సినిమాలోనే.

వీరరాఘవరెడ్డి అంటే చాలు .. వెంటనే ఆ భారీ శరీరం, అంతకుమించి బేస్ వాయిస్ గుర్తొస్తాయి. సమరసింహారెడ్డి లో విలన్ గా బాగా పాపులర్ అయిన జయప్రకాష్ రెడ్డి .. అసలు డైలాగ్స్ తో ఎంటర్ టైన్ చేసే బాలయ్యనే తన డైలాగ్స్ తో మరిపించారు. బాలయ్య సమరసింహారెడ్డితో పాటు వరుసగ వచ్చిన నర్సింహనాయుడు, చెన్నకేశవ రెడ్డి ఇలా బ్యాక్ టూ బ్యాక్ విలన్ గా బాలయ్యతో విలన్ గా చేశారు జయప్రకాష్ రెడ్డి.

ఆ తర్వాత చిరంజీవి నాగార్జున, రవితేజ లాంటి స్టార్ హీరోలతో పాటు ఈ తరం స్టార్ హీరోలందరితో నటించారు జయప్రకాష్ రెడ్డి. రామ్ చరణ్, మహేష్, ఎన్టీఆర్, నాని దగ్గరనుంచి రీసెంట్ సాయిధరమ్ తేజ్, సుశాంత్, లాంటి యంగ్ స్టార్స్ తో కూడా నటించారు జయప్రకాష్ . కంప్లీట్ విలన్ గా కాకుండా ట్రెండ్ కి తగినట్టు కామెడీ విలన్ గా సెట్ అయ్యిపోయారు ఈ సీనియర్ నటుడు.
https://10tv.in/samyuktha-hegde-case-congress-leader-kavitha-reddy-apologises/
పర్టిక్యులర్ గా విలన్ గానే కాకుండా, అలా అని జస్ట్ కమెడియన్ లా కాకుండా పాత్ర పరిధిని బట్టి..విలనిజానికి కామెడీని జోడించి, దానికి అదిరిపోయే ఎక్స్ ప్రెషన్స్ తో స్క్రీన్ మీద తన ప్రతిభను చూపించేవారు జయప్రకాష్. రెడీ, ఢీ నువ్వొస్తానంటే నేనొద్దంటానా,లాంటి అటు కామెడీ టచ్ ఉన్న విలన్ క్యారెక్టర్స్ తో కూడా ఆడియన్స్ ని కన్విన్స్ చేసి తాను చాలా స్పెషల్ అనిపించుకున్నారు జయప్రకాష్ .



ఏం అబ్బీ… ఏం చేత్తనావూ లాంటి డైలాగ్స్ తో కంప్లీట్ కామెడీని ఓన్ చేసుకుని తనలోని కామెడీ యాంగిల్ తో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేశారు జయప్రకాష్. ఎక్స్ ట్రీమ్ విలనిజం తో పాటు అంతే ఈజ్ ఆఫ్ కామెడీని పండించిన వర్సెటైల్ యాక్టర్ జయప్రకాష్ రెడ్డి తననటనతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు.

జయప్రకాశ్ ది భారీ ఆకారం… ఆయన ఎదురు పడితేనే భయపడే విధంగా ఉంటారు. కాని కామెడీ చేయాలంటే ఆయన తరువాతే ఎవరైనా. విలన్లు సీరియస్ గా చెప్పే డైలాగ్స్ ఆయన కామెడీగా చెప్పడంతో ఆడియన్స్ నవ్వకుండా ఉండలేరు. ముఖ్యంగా విలన్ గెటప్ వేసి కామెడీ డైలాగ్స్ చెప్పే స్టైల్ తో ప్రతి ఒక్కరినీ నవ్వించేవారు జయప్రకాష్ రెడ్డి.

జయప్రకాశ్ అంత ఫేమస్ అవ్వడానికి సీమ స్లాంగ్ ప్లస్ గా మారింది. రాయలసీమ యాసలో ఆయన చెప్పే డైలాగ్స్ ఆడియన్స్ ని ఆకర్షిస్తాయి. అదే స్లాంగ్ లో ఆయన తిట్టే వెరైటీ తిట్లు వద్దన్నా నవ్వు తెప్పిస్తుంది. అందుకే ఆయన విలన్ గెటప్ లు వేసిన సరే ఆయన కోసం కామెడీ ట్రాక్ మాత్రం మర్చిపోరు డైరెక్టర్స్.

జయప్రకాశ్ కత్తులతోనే కాదు… కామెడీతో కూడా చంపేస్తారు. బాంబులతో నే కాకుండా డైలాగ్ లతో కూడా లేపేస్తారు. జయప్రకాష్ టిపికల్ బేస్ వాయిస్ తో చెప్పే డైలాగ్స్ తో సీన్ ని పండించేస్తారు. ఆయన వాయిస్ తోనే సీన్ మొత్తం నడిపించిన సినిమాలు చాలా ఉన్నాయి.

కంచు కంఠంతో ఆయన డైలాగ్స్ చెపుతుంటే…. హాల్ మొత్తం మోత మోగిపోవాల్సిందే. ఇలా ఓన్లీ విలనిజం కాదు .. ఓన్లీ కామెడీ కాదు ..ఓన్లీ క్యారెక్టర్లే కాదు ..తనకు వచ్చిన ఏ క్యారెక్టర్ అయినా ప్రేక్షకులకు నచ్చేలా మెచ్చేలా నటించి అందరి మనసుల్లో నిలిచిపోయారు జయప్రకాష్ రెడ్డి.