Prashanth: డైవర్స్ తీసుకొని 15 ఏళ్ళు.. ‘జీన్స్’ హీరో మళ్ళీ పెళ్లి?

తమిళ హీరో ప్రశాంత్ గుర్తున్నాడా?.. అదే దర్శకుడు శంకర్ మ్యాజికల్ మూవీ జీన్స్ సినిమాలో ద్విపాత్రాభినయం చేసి ఇండియా వైజ్ గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ ఒక టైంలో కోలీవుడ్ స్టార్..

Prashanth: డైవర్స్ తీసుకొని 15 ఏళ్ళు.. ‘జీన్స్’ హీరో మళ్ళీ పెళ్లి?

Prashanth

Prashanth: తమిళ హీరో ప్రశాంత్ గుర్తున్నాడా?.. అదే దర్శకుడు శంకర్ మ్యాజికల్ మూవీ జీన్స్ సినిమాలో ద్విపాత్రాభినయం చేసి ఇండియా వైజ్ గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ ఒక టైంలో కోలీవుడ్ స్టార్ హీరోలకు వరస సినిమాలతో సవాల్ విసిరాడు. కానీ.. ఎందుకో మెల్లగా ప్రశాంత్ గ్రాఫ్ పడిపోగా ఆ మధ్య రామ్ చరణ్ వినయవిధేయ రామ సినిమాతో తెలుగులో రీఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం తమిళంలో కూడా ఒక సినిమా నటిస్తున్న ప్రశాంత్ సెకండ్ ఇన్నింగ్స్ తో అయినా బిజీ కావాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాడు.

Kollywood Stars: టాలీవుడ్‌లో పాగా వేసేందుకు తమిళ తంబీల ప్లాన్స్!

కాగా.. ప్రశాంత్ హీరోగా బిజీగా ఉన్న సమయంలో 2005లో వ్యాపారవేత్త కూతురు గృహలక్ష్మితో పెళ్లి జరిగింది. వీరికి ఓ కొడుకు కూడా ఉన్నాడు. అయితే, ఏమైందో ఏమో కానీ ఇద్దరి మధ్య మనస్పర్థల కారణంగా మూడేళ్ళ తర్వాత విడాకులు తీసుకున్నారు. అప్పుడే ప్రశాంత్ కెరీర్ కూడా డౌన్ ఫాల్ మొదలైంది. ఏకంగా ఐదేళ్ల పాటు సినిమాలకు దూరమైన ప్రశాంత్ ఆ తర్వాత మళ్ళీ ఎంత ప్రయత్నించినా కెరీర్ లో కోలుకోలేకపోయాడు. కాగా.. ప్రశాంత్ ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నట్లు కోలీవుడ్ సమాచారం.

Kollywood Hero’s: పెరిగిన బెందిరింపులు.. పాపం కోలీవుడ్ హీరోలు!

ప్రస్తుతం 48 ఏళ్ల వయసులో ఉన్న ప్రశాంత్ తన కుటుంబానికి బాగా తెలిసిన వ్యక్తి, తనకు పరిచయం ఉన్న ఓ వ్యక్తిని త్వరలోనే పెళ్లాడేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చే ఛాన్స్ ఉండగా.. అలనాటి హ్యాండ్సమ్ హీరో మళ్ళీ పెళ్లి చేసుకోబోతుండడంతో ఆయన అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెప్తున్నారు.