Jeevitha Rajasekhar : చిరంజీవికి మాకు ఎలాంటి విబేధాలు లేవు.. వాళ్ళే ఇదంతా చేస్తున్నారు..

ప్రెస్ మీట్ లో కొంతమంది విలేఖరులు చిరంజీవి గారి గురించి అడగడంతో జీవితా మాట్లాడుతూ.. ''మాకు ఇండస్ట్రీలో ఎవరితోనూ ఎలాంటి ఇబ్బందులు లేవు. చిరంజీవితో..............

Jeevitha Rajasekhar : చిరంజీవికి మాకు ఎలాంటి విబేధాలు లేవు.. వాళ్ళే ఇదంతా చేస్తున్నారు..

Jeevitha

Jeevitha Rajasekhar :  రాజశేఖర్ హీరోగా, ఆయన కూతురు శివాని ముఖ్యపాత్రలో మలయాళంలో సూపర్ హిట్ అయిన జోసెఫ్ సినిమా సినిమాని తెలుగులో శేఖర్ సినిమా పేరుతో తెరకెక్కించారు జీవితా రాజశేఖర్. ఈ సినిమా నిర్మాణంలో కూడా భాగమయ్యారు జీవిత. ఈ సినిమాని మే 20వ తేదీన విడుదల చేయనున్నారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ప్రెస్ మీట్ లో పలు ఆసక్తికర విషయాలని వెల్లడించారు జీవిత.

ఈ ప్రెస్ మీట్ లో కొంతమంది విలేఖరులు చిరంజీవి గారి గురించి అడగడంతో జీవితా మాట్లాడుతూ.. ”మాకు ఇండస్ట్రీలో ఎవరితోనూ ఎలాంటి ఇబ్బందులు లేవు. చిరంజీవితో కూడా మాకు ఎలాంటి గొడవలు లేవు. చిరంజీవిగారితో ఎప్పుడో జరిగిన ఓ విషయాన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వ్యూస్ కోసం మళ్ళీ మళ్ళీ ఆ వీడియోల్ని పిచ్చి పిచ్చి థంబ్‌నెయిల్స్ పెట్టి పోస్ట్ చేస్తున్నారు. వాళ్ళే మళ్ళీ మాకు, చిరంజీవి గారి మధ్య దూరాన్ని పెంచాలని చూస్తున్నారు. రాజశేఖర్ ఇప్పుడు చిరంజీవి పిలిచి ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్నారు” అని తెలిపారు.

Manchu Vishnu : ఆరు నెలల్లో ‘మా’ బిల్డింగ్ మొదలు పెడతాను.. మంచు విష్ణు కామెంట్స్..

అలాగే ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ”మలయాళంలో సూపర్ హిట్ అయిన జోసెఫ్ సినిమా మాకు నచ్చడంతో తెలుగు రైట్స్ తీసుకున్నాం. ఈ సినిమాను “శేఖర్” పేరుతో తీయాలని పలాస డైరెక్టర్, నీలకంఠను కలిసినా వారు బిజీగా ఉండటంతో ఈ సినిమాకు నేనే దర్శకురాలిగా చేయాల్సి వచ్చింది. రాజశేఖర్, శివాని ఇద్దరూ ఈ సినిమాలో ఉన్నా ఒక డైరెక్టర్ గానే వారితో చేయించాను. నేను కూడా మంచి క్యారెక్టర్ వస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాను” అని తెలిపారు.