జెర్సీ – ఫస్ట్ డే కలెక్షన్స్

రెండు తెలుగు రాష్ట్రాల్లో జెర్సీ మొదటిరోజు రూ. 4.5 కోట్ల షేర్ రాబట్టిందని తెలుస్తుంది..

  • Published By: sekhar ,Published On : April 20, 2019 / 12:03 PM IST
జెర్సీ – ఫస్ట్ డే కలెక్షన్స్

రెండు తెలుగు రాష్ట్రాల్లో జెర్సీ మొదటిరోజు రూ. 4.5 కోట్ల షేర్ రాబట్టిందని తెలుస్తుంది..

నేచురల్ స్టార్ నాని, శ్రద్ధా శ్రీనాధ్ జంటగా, మళ్ళీ రావా ఫేమ్.. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో రూపొందిన పిరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా జెర్సీ.. ఏప్రిల్ 19 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మార్నింగ్ షో నుండే మౌత్ టాక్‌తో, హౌస్ ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతుంది. అన్ని ఏరియాల నుండి పాజిటివ్ టాక్ దక్కించుకోవడమే కాక, నాని నటనకు మంచి మార్కులు పడ్డాయి. నాని కెరీర్‌లో జెర్సీ మైలురాయిగా మిగిలిపోతుందని ట్రేడ్ వర్గాలవారు అంటున్నారు. 
Also Read : షూటింగ్ పూర్తి చేసుకున్న సెవెన్

రెండు తెలుగు రాష్ట్రాల్లో జెర్సీ మొదటిరోజు రూ. 4.5 కోట్ల షేర్ రాబట్టిందని తెలుస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.5 లేదా రూ. 6 కోట్ల మధ్యలో ఉండొచ్చని చెప్తున్నారు. ఇక వీకెండ్‌లోనూ జెర్సీ బాక్సాఫీస్ దగ్గర సత్తాచాటే అవకాశం పుష్కలంగా ఉంది. త్వరలో మరికొద్ది థియేటర్స్ యాడ్ చేసే అవకాశం ఉందని ఫిలిం నగర్ టాక్.

వాచ్ జెర్సీ ట్రైలర్..