Bigg Boss 5 : ఇద్దరూ చెరో వైపు ముద్దు పెట్టండి : జెస్సి

ఈ సీజన్ తెలుగు బిగ్ బాస్ లో గొడవలు తప్ప వేరే ఎమోషన్స్ ఎక్కువగా కనపడట్లేదు. అప్పుడప్పుడు ఏడుపులు కనిపిస్తున్నాయి అంతే. గత సీజన్స్ లో లవ్ ట్రాక్స్ చాలా ఉండేవి. రోజూ ఒక లవ్ సీన్

Bigg Boss 5 : ఇద్దరూ చెరో వైపు ముద్దు పెట్టండి : జెస్సి

Jessi

Bigg Boss 5 :  ఈ సీజన్ తెలుగు బిగ్ బాస్ లో గొడవలు తప్ప వేరే ఎమోషన్స్ ఎక్కువగా కనపడట్లేదు. అప్పుడప్పుడు ఏడుపులు కనిపిస్తున్నాయి అంతే. గత సీజన్స్ లో లవ్ ట్రాక్స్ చాలా ఉండేవి. రోజూ ఒక లవ్ సీన్ ఉండేలా ప్లాన్ చేసే వాళ్ళు. ఈ సారి మానస్ ప్రియాంకని తప్ప ఎవరి మధ్య లవ్ ట్రాక్స్ వేయట్లేదు. రొమాన్స్ ఎమోషన్ ని ఎవరితోనూ తీసుకురాలేకపోతున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. రొమాంటిక్ సీన్ క్రియేట్ చేద్దాం అనుకున్నా అవి అంతగా వర్క్ అవుట్ అవ్వట్లేదు. తాజాగా మరోసారి రొమాంటిక్ సీన్ ని ట్రై చేసారు బిగ్ బాస్ లో కానీ అది కూడా వర్క్ అవుట్ అవ్వలేదు.

Bigg Boss 5 : విలన్స్ వర్సెస్ హీరోస్.. బిగ్ బాస్ లో బిగ్ ఫైట్

ఒక పక్క సీరియస్ గా కెప్టెన్సీ టాస్కులు జరుగుతుంటే జెస్సి మెడలు పట్టేశాయని రెస్ట్ తీసుకుంటున్నాడు. సిరి, ప్రియాంకలు జెస్సికి అటు ఇటు వచ్చి కూర్చున్నారు. అమాయకుడిలా కనిపించే జెస్సి అప్పుడప్పుడు అమ్మాయిలతో పులిహార కలపడానికి బాగానే ట్రై చేస్తాడు. నిన్న కూడా తనకు అటు ఇటు కూర్చున్న సిరి, ప్రియాంకలను చూసి.. నా బుగ్గలు రెండు మాసిపోతున్నాయి. ఇద్దరూ కలిసి అటు ఇటు ఒక ముద్దు పెడితే బాగుంటుంది అని అన్నాడు. దీంతో ఇద్దరూ షాక్ అయ్యారు. ఇది విని షాకైన సిరి కెమెరా వచ్చి తంతుందని చెప్పింది. జెస్సి మరోసారి ఏంటీ ముద్దులు పెట్టరా? అని అడగ్గా ఇద్దరూ నో చెప్పడంతో మీరిద్దరూ నా బేబీలు అని అన్నాడు. దీంతో వాళ్ళిద్దారూ అక్కడ్నించి వెళ్లిపోయారు. మొత్తానికి రొమాంటిక్ సీన్ చేద్దామని ట్రై చేసారు కానీ అది వర్క్ అవుట్ అవ్వలేదని క్లియర్ గా తెలుస్తుంది.