Bigg Boss 5 : సిరి చెంప పగులకొట్టేవాడిని అంటూ జెస్సి సంచలన వ్యాఖ్యలు

వీరిద్దరి రిలేషన్‌పై బిగ్‌బాస్‌ నుంచి బయటకి వచ్చేసిన కంటెస్టెంట్‌ జెస్సీ మాట్లాడుతూ.. బయటి ప్రపంచంతో సంబంధం లేకపోవడంతో అక్కడ ఉన్నవాళ్లతోనే క్లోజ్‌గా.........

Bigg Boss 5 : సిరి చెంప పగులకొట్టేవాడిని అంటూ జెస్సి సంచలన వ్యాఖ్యలు

Jessy

Bigg Boss 5 :  బిగ్ బాస్ లో రోజు రోజుకి సమీకరణాలు మారిపోతూ ఉంటాయి. ఇవాళ ఫ్రెండ్స్ అయిన వాళ్ళు రేపు శత్రువులు అవ్వొచ్చు. ఇవాళ శత్రువులుగా ఉన్న వాళ్ళు రేపు ఫ్రెండ్స్ అవ్వొచ్చు. ఏ పరిచయం లేని వాళ్ళు ఫ్రెండ్స్ అవ్వొచ్చు, లవర్స్ అవ్వొచ్చు. ఈ సీజన్ లో అందరూ ఎక్కువగా మాట్లాడుకునేది సిరి, షన్ను గురించే. బిగ్ బాస్ కంటే ముందునుంచే ఫ్రెండ్స్ అయిన వీళ్ళు హౌస్ లోకి వచ్చాక బాగా క్లోజ్ అయ్యారు. ఒక రోజు గొడవపడతారు, ఇంకో రోజు క్లోజ్ అయిపోతారు. హగ్గులు, కిస్సులు ఇచ్చుకుంటారు, కొట్టుకుంటారు. ఒక పక్క ఫ్రెండ్స్ అని చెప్తూనే రొమాన్స్ చేస్తారు. ప్రేక్షకులు వీళ్ళ గురించి అర్ధం కాక తల పగలకొట్టుకుంటున్నారు.

Bigg Boss 5 : పాన్ షాప్ పెట్టి సిరిని పెంచాను.. షణ్ముఖ్‌ని హగ్ చేసుకోవడం నాకు నచ్చలేదు: సిరి తల్లి

సిరి, షణ్ముఖ్ ల మధ్య బంధం బలపడుతుంది అని సిరి స్వయంగా ఒప్పుకుంది. తప్పు అని తెలిసినా మా ఇద్దరి మధ్య కనెక్షన్‌ పెరుగుతుందంటూ నాగార్జునకి చెప్పింది. ఇక వీళ్లిద్దరి కిస్సులు, హగ్స్ బాగా వైరల్ అయ్యాయి. కొద్ది రోజుల క్రితం వరకు హౌస్ లో వీళ్ళిద్దరితో పాటు జెస్సి కూడా కలిసి ఉండేవాడు . ఆరోగ్యం సహకరించకపోవడంతో జెస్సి షో నుంచి వెళ్ళిపోయాడు. ఇటీవల జెస్సి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సిరి, షన్ను గురించి మాట్లాడాడు.

Aryan Khan : ఇంకా తేరుకొని ఆర్యన్ ఖాన్… కౌన్సిలింగ్ ఇప్పించనున్న హృతిక్

వీరిద్దరి రిలేషన్‌పై బిగ్‌బాస్‌ నుంచి బయటకి వచ్చేసిన కంటెస్టెంట్‌ జెస్సీ మాట్లాడుతూ.. బయటి ప్రపంచంతో సంబంధం లేకపోవడంతో అక్కడ ఉన్నవాళ్లతోనే క్లోజ్‌గా ఉంటారు. కానీ బయటకు వచ్చాక అది కంటిన్యూ అవ్వదు. ఎవరి పనులు వాళ్ళవి అని అన్నాడు. ఇక షణ్ముఖ్ కోసం సిరి తలను గోడకేసి గుద్దుకోవడం ఏమాత్రం నచ్చలేదని, ఆ సమయంలో నేను అక్కడ ఉంటే కచ్చితంగా సిరి చెంప పగులకొట్టేవాడినంటూ వ్యాఖ్యలు చేశాడు.