Pooja Hegde: జిగేలు రాణి ఈజ్ బ్యాక్.. ఎఫ్‌3లో పూజా స్పెషల్ ట్రీట్!

హీరోయిన్ గా పీక్ స్టేజ్ ను ఎంజాయ్ చేస్తోంది. టాప్ హీరోలకు కూడా డేట్స్ అడ్జస్ట్ చేయలేని ఛార్మ్ చూపిస్తోంది. అయినా సరే స్పెషల్ సాంగ్ చేసేందుకు ఈ బ్యూటీ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తోంది

Pooja Hegde: జిగేలు రాణి ఈజ్ బ్యాక్.. ఎఫ్‌3లో పూజా స్పెషల్ ట్రీట్!

Pooja Hegde

Pooja Hegde: హీరోయిన్ గా పీక్ స్టేజ్ ను ఎంజాయ్ చేస్తోంది. టాప్ హీరోలకు కూడా డేట్స్ అడ్జస్ట్ చేయలేని ఛార్మ్ చూపిస్తోంది. అయినా సరే స్పెషల్ సాంగ్ చేసేందుకు ఈ బ్యూటీ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తోంది. వెంకీ, వరుణ్ లతో కలిసి ఫన్నీగా ఐటమ్ చేయడానికి రీసెంట్ గా ఎస్ చెప్పేసింది. ఇంతకీ ఎవరా సూపర్ క్వీన్ అంటారా.. అయితే ఈ స్టోరీ చూసేయండి.

Pooja Hegde: పూజా రేటు కోటి.. సినిమాకు కాదండోయ్!

మళ్లీ స్పెషల్ గా కనిపించేందుకు.. ఐటమ్ సాంగ్ చేసేందుకు బుట్టబొమ్మ ఎస్ చెప్పేసింది. రంగస్థలం చిట్టిబాబుతో జిగేలురాణిగా చిందులేసిన పూజా హెగ్డే.. ఇప్పుడు ఎఫ్3 మూవీలో కాలు కదిపేందుకు రెడీఅయింది. ఏప్రిల్ 14 నుంచే వెంకీ, వరుణ్ తో కలిసి షూట్ లో పాల్గొనబోతుంది బుట్టబొమ్మ. వంశీ పైడిపల్లి-విజయ్ సినిమా కోసం డేట్స్ అడ్జస్ట్ చేయలేనంత బిజీగా ఉన్న ఈ హీరోయిన్.. దిల్ రాజు అడగ్గానే ఎఫ్3లో ఐటమ్ సాంగ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

Pooja Hegde-Rashmika: నువ్వా.. నేనా.. ఏ ఇండస్ట్రీలో చూసినా ఈ ఇద్దరే!

సౌత్ టు నార్త్ టాప్ హీరోల సినిమాలకు సైన్ చేస్తూ పూజా హెగ్డే ఫుల్ ఫామ్ లో ఉంది. ఆచార్యలో స్పెషల్ రోల్ చేసిన బుట్టబొమ్మ.. ఇప్పుడెంత బిజీగా ఉన్న ఎఫ్3 కోసం స్పెషల్ సాంగ్ చేయడం నిజంగా స్పెషలే. అయితే ఈ పాట కోసం ఏకంగా కోటి రూపాయలు నిర్మాతలు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. మే 27న రిలీజ్ కాబోతున్న వెంకీ వరుణ్ ఫన్ డోస్.. పూజా హెగ్డేని ఐటమ్ సాంగ్ తో ప్రెజెంట్ చేస్తుందంటే సినిమాకి మైలేజ్ పెరిగినట్టే. ప్రస్తుతం ఎఫ్3 ప్యాచ్ వర్క్ పూర్తి చేస్తున్న అనిల్ రావిపూడి.. ఈ 14 నుంచి పూజా హెగ్డేతో చేసే స్పెషల్ సాంగ్ కోసం ఇప్పుడు కసరత్తులు చేస్తున్నారు.