Arabic Kuthu: విజయ్ బీస్ట్ పాటకి ఎన్టీఆర్ ‘లవ్ దెబ్బ’ మాస్ స్టెప్పులేస్తే?!

ఇళయ దళపతి విజయ్ కొత్త సినిమా ‘బీస్ట్’. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తుండగా.. కళానిధి మారన్ సమర్పణలో, ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మిస్తోంది

Arabic Kuthu: విజయ్ బీస్ట్ పాటకి ఎన్టీఆర్ ‘లవ్ దెబ్బ’ మాస్ స్టెప్పులేస్తే?!

Arabic Kuthu

Arabic Kuthu: ఇళయ దళపతి విజయ్ కొత్త సినిమా ‘బీస్ట్’. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తుండగా.. కళానిధి మారన్ సమర్పణలో, ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మిస్తోంది. దళపతికి ఇది 65వ సినిమా కాగా.. పూజా హెగ్డే హీరోయిన్. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఓ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. వాలంటైన్స్ డే రోజుల రిలీజ్ చేసిన ఈ పాట తమిళనాట సెన్సేషనల్ హిట్ గా నిలిచింది.

Acharya: హిందీలోకి ఆచార్య.. చెర్రీ పాపులారిటీ క్యాష్ చేసుకునేందుకేనా?

మహేష్ సర్కారు వారి పాటలోని కళావతి సాంగ్.. బీస్ట్ అరబిక్ కుతు సాంగ్ సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నాయి. ఒకరకంగా మహేష్, విజయ్ ఫ్యాన్స్ ఈ రెండు పాటలను పోటాపోటీగా వైరల్ చేశారు. ఇదే వరసలో బీస్ట్ అరబిక్ కుతు పాటకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టెప్పులేస్తే ఎలా ఉంటుందో అనే ఐడియా రావడంతో మరో పాట తయారైంది. నాన్నకు ప్రేమతో సినిమా లవ్ దెబ్బ పాటలో ఎన్టీఆర్, రకుల్ డాన్స్ దుమ్మురేపారు. అరబిక్ కుతు పాటకి ఓ నెటిజన్ లవ్ దెబ్బ విజువల్ తో పాటను తయారు చేసి సోషల్ మీడియాలో వదిలారు.

Thalaivar169: మరోసారి రజినీతో ఐష్.. రోబో లాంటి బ్లాక్ బస్టర్ అవుతుందా?

సహజంగానే ఎన్టీఆర్, విజయ్ డాన్స్ లో విరగదీస్తారనే పేరుంది. అరబిక్ కుతు పాటలో కూడా విజయ్ డాన్స్ స్టెప్స్ అదుర్స్ అనిపించుకున్నాయి. పూజా హెగ్డే చార్మింగ్ విజయ్ డాన్స్ ఈ పాటని ఎక్కడికో తీసుకెళ్లాయి. సేమ్ నాన్నకు ప్రేమతోలో లవ్ దెబ్బ పాట స్టెప్పులు కూడా అరబిక్ కుతు పాటకి సెట్టవ్వడంతో ఈ పాట కూడా ఇప్పుడు రచ్చగా మారింది. ఈ రెండు పాటలకి జానీ మాస్టరే కొరియోగ్రఫీ చేయడం విశేషం.