RRR: సల్మాన్‌తో కలిసి ‘నాటు’ స్టెప్పులేసిన తారక్-చరణ్!

ఆర్ఆర్ఆర్ టీమ్ ప్రమోషన్ విషయంలో అస్సలు తగ్గడం లేదు. ఉన్న ఏ అవకాశాన్ని బూతద్దం పెట్టి మరీ వెతికి పట్టుకొని అక్కడ వాలిపోయి సినిమా ప్రమోషన్ చేసుకుంటున్నారు. సినిమా విషయంలోనే కాదు..

RRR: సల్మాన్‌తో కలిసి ‘నాటు’ స్టెప్పులేసిన తారక్-చరణ్!

Rrr (1)

RRR: ఆర్ఆర్ఆర్ టీమ్ ప్రమోషన్ విషయంలో అస్సలు తగ్గడం లేదు. ఉన్న ఏ అవకాశాన్ని బూతద్దం పెట్టి మరీ వెతికి పట్టుకొని అక్కడ వాలిపోయి సినిమా ప్రమోషన్ చేసుకుంటున్నారు. సినిమా విషయంలోనే కాదు ప్రమోషన్ విషయంలో కూడా పక్కా ప్రణాళికతో ఉండే దర్శకుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ విషయంలో మరీ స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టాడు. హీరోలిద్దరితో పాటు తాను కూడా సినిమా ప్రమోషన్లతో మోతెక్కిస్తున్నారు. గత వారం ముంబైలో భారీ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించిన ఆర్ఆర్ఆర్ టీమ్ అప్పటి నుండి అక్కడే ఉంటూ పలు టీవీషోలు.. ఇతర ప్రమోషన్ల కార్యక్రమాలలో బిజీబిజీగా ఉన్నారు.

Rajinikanth: అన్నాత్తై టీమ్ సభ్యులకు సూపర్ స్టార్ గోల్డ్ చైన్స్ గిఫ్ట్!

నిజానికి నార్త్ నుండి మన హీరోలు తారక్, చరణ్ ఇంత భారీ స్థాయిలో వస్తుందని అంచనా వేయలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఉత్తరాది ప్రేక్షకుల ప్రేమకు అక్కడే ఉండిపోయి సినిమాకు మరింత ప్రమోషన్ చేసి పెడుతున్నారు. కాగా.. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ అతిధిగా హాజరై ఈవెంట్ ను మరోస్థాయికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు సల్మాన్ తో కలిసి మరో వేదికపై కూడా మన హీరోలు హల్చల్ చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకి కలిసి స్టెప్పులేసి సందడి చేశారు.

Rrr

Rrr

Avatar 2: సకుటుంబ సపరివార సమేతంగా రానున్న అవతార్-2

సల్మాన్ హోస్ట్ చేస్తున్న గ్రాండ్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ కు అలియా, రాజమౌళితో సహా హాజరైన హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ మోస్ట్ ఫన్నీ హంగామా సృష్టించారు. ఈ స్టేజ్ పైనే ఎన్టీఆర్, చరణ్ సల్మాన్ తో ఆర్ఆర్ఆర్ సినిమాలో మాస్ సాంగ్ హిందీ వెర్షన్ నాచో నాచోకి కలిపి స్టెప్పేశారు. ఇప్పటికే విడుదలైన ఈ ఎపిసోడ్ ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా ఈ ఎపిసోడ్ ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందా అని బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఈగర్ వెయిట్ చేస్తున్నారు.