Pan India Star’s: తారక్-చరణ్ ప్లాన్ చేశారు.. బన్నీ నిజం చేసుకున్నాడు!

ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని ఎక్స్ పెక్ట్ చేయనివి జరిగిపోతుంటాయి. 2020 నుంచి ప్యాన్ ఇండియా స్టార్స్ అవుదామనుకున్నారు ఇద్దరు టాలీవుడ్ హీరోస్. కానీ అనుకోకుండా మరొకరు సెట్టయ్యారు.

Pan India Star’s: తారక్-చరణ్ ప్లాన్ చేశారు.. బన్నీ నిజం చేసుకున్నాడు!

Pan India Star's

Pan India Star’s: ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని ఎక్స్ పెక్ట్ చేయనివి జరిగిపోతుంటాయి. 2020 నుంచి ప్యాన్ ఇండియా స్టార్స్ అవుదామనుకున్నారు ఇద్దరు టాలీవుడ్ హీరోస్. కానీ అనుకోకుండా మరొకరు సెట్టయ్యారు. కొవిడ్ టైమ్ లో బ్లాక్ బస్టర్స్ ఇచ్చి లక్కీ స్టార్ అనిపించుకుంటున్నారు. అయితే చరణ్ సంగతి ఓకే.. ఎటొచ్చి యంగ్ టైగర్ పరిస్థితే మరీ ఇరకాటంలో పడింది. ప్రభాస్ తర్వాత ఆ స్థాయిలో పాన్ ఇండియా అవతార్స్ అవుదామనుకున్నారు. ట్రిపుల్ ఆర్ సినిమా ఇచ్చే గ్రేస్ తో ఇండియా వైడ్ రచ్చ చేయొచ్చని కళలు కన్నారు. అయితే సినిమా రిలీజ్ కు ముందే సౌత్ టు నార్త్ అంత క్రేజ్ దక్కించుకున్నారు చరణ్, తారక్.

Jr NTR: తారక్ నష్టనివారణ చర్యలు.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు

ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లోనే వాళ్లకున్న స్టార్ ఇమేజ్ ఏంటో తెలిసిపోయింది. కానీ సినిమా రిలీజయ్యాక వచ్చే స్టార్ డం వేరు. దాన్ని వాళ్లిద్దరూ మిస్ చేసుకున్నా.. అనుకోకుండా బన్నీ సాధించారు. ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా నార్త్ లో సత్తా చాటుతున్నారు పుష్పరాజ్. కొవిడ్ కారణంగా 3 సంవత్సరాల పై నుంచే చరణ్, తారక్ నుంచి ఏ సినిమా రాలేదు. కేవలం ట్రిపుల్ ఆర్ షూటింగ్ కే మాక్సిమం టైం ఇచ్చేశారు. అది చూస్తే వాయిదా మీద వాయిదా పడుతోంది. అరవింద సమేత తర్వాత తారక్ సినిమా రాలేదు. వినయ విధేయ రామ తర్వాత రామ్ చరణ్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు.

Sai Pallavi: అప్పుడే పెళ్లి ఎంటండి బాబు.. నాకింకా 29 ఏళ్లే!

కానీ 2020 కొవిడ్ ముందు అల వైకుంఠపురంతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చారు అల్లు అర్జున్. 2021 ఎండింగ్ లో పుష్ప లాంటి సాలిడ్ హిట్ కొట్టారు. సో ఇలా ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిందే అన్నట్టు ఆ ఇద్దరికి దక్కాల్సిన నేషనల్ క్రేజ్… కొవిడ్ టైమ్ లో కొట్టేసారు ఐకాన్ స్టార్. ప్రభాస్ లా పాన్ ఇండియా ఇమేజ్ వస్తే వంద కోట్లకు రెమ్యునరేషన్ పెరగొచ్చు. కానీ ట్రిపుల్ ఆర్ ని నమ్ముకున్న ఎన్టీఆర్ కు చాలా కాలం కరిగిపోయింది. కనీసం ఈ టైమ్ లో 4, 5 సినిమాలు చేసినా 200 కోట్ల వరకు వెనకేసుకునేవారు. 35 కోట్ల రెమ్యునరేషన్ తో ఆర్ఆర్ఆర్ కి ఎన్టీఆర్ ఓకే చెప్పారని టాక్. రాజమౌళి ఇచ్చే పాన్ ఇండియా ఇమేజ్ చాలనుకున్నారు. ప్రభాస్ ని ఎగ్సాంపుల్ గా తీసుకున్నారు తారక్. జక్కన్న చెప్పినట్టు వెయిట్ చేసారు కాబట్టే ఈరోజు నంబర్ 1 మాత్రమే 150 కోట్ల వరకు అమౌంట్ అందుకుంటున్నారు గ్లోబల్ స్టార్.

Raveena Tandon: బ్రదర్‌తో సంబంధం అంటగట్టారు.. గత జ్ఞాపకాలను తలచుకున్న రవీనా!

ఆర్ఆర్ఆర్ సినిమాతో తారక్ ఇమేజ్ ఎలాంటి టర్న్ తీసుకుంటుందో ముందు ముందు తెలుస్తోంది. ఇన్నాళ్లు ఓపిక పట్టినందుకు అనుకున్నది సాధిస్తే.. తారక్ ఫ్యాన్స్ కన్నా సంతోషించే వాళ్లు ఎవరు ఉండరు. కానీ ఆర్ఆర్ఆర్ తర్వాత చేయబోయే సినిమా ఎలా వుండాలన్నదానిపై క్లారిటీ మిస్ అవుతుంది తారక్ కి. ఈ కారణంగానే త్రివిక్రమ్ సినిమాను వదిలేసి కొరటాల బాటపట్టారని చెప్తారు. కొరటాల మూవీని పాన్ ఇండియా లెవెల్ లో మార్చుతున్నారు. అయితే ఈ సినిమా ఇంకా సెట్స్ పైకెళ్లలేదు. కొరటాల ప్రాజెక్ట్ తో పాటూ బుచ్చిబాబుతో మరో నేషనల్ మూవీని తారక్ ఒకేసారి పూర్తి చేస్తారని అంటున్నారు. ఇంక కొరటాల తర్వాత ప్రశాంత్ నీల్ తో ఓ మాస్ యాక్షన్ మూవీ చేయాల్సి ఉంది ఎన్టీఆర్.

Young Hero’s: మారుతున్న ట్రెండ్.. స్టార్ హీరోల సినిమాలలో యంగ్ హీరోలు!

అదే ట్రిపుల్ ఆర్ హీరో రామ్ చరణ్ సంగతి వేరు. రాజమౌళితో చేస్తూనే ఆచార్యనూ పూర్తి చేశారు రామ్ చరణ్. చూస్తుండగానే శంకర్ సినిమాను పట్టాలెక్కించారు. ఆర్ఆర్ఆర్ రిలీజ్ కాకముందే శంకర్ సినిమాతో పాన్ ఇండియా ప్రాజెక్ట్ మరొకటి దొరికేసింది. త్వరలోనే గౌతమ్ తిన్ననూరితో మరో ప్యాన్ ఇండియా సినిమాను మొదలెట్టబోతున్నారు. ఆ తర్వాత సుకుమార్ సినిమా ట్రాక్ లో ఉంది. ప్రశాంత్ నీల్ కూడా చరణ్ కోసం స్ట్రిప్ట్ రెడీ చేస్తున్నారనే టాక్ ఉంది.