RRR: జక్కన్న ఊహించిన దానికంటే తారక్ బెటర్ పర్ఫామెన్స్.. కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్..

RRR: జక్కన్న ఊహించిన దానికంటే తారక్ బెటర్ పర్ఫామెన్స్.. కామెంట్స్ వైరల్!

Rrr

RRR: టాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కాంబినేషన్లో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా బాక్సాఫీస్ ని కలెక్షన్లతో ముంచెత్తుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశంలోని అన్ని ప్రాంతాల్లో, విదేశాల్లో కూడా ఈ సినిమా కలెక్షన్లలో సరికొత్త రికార్డులని సృష్టిస్తుంది. సినిమా రిలీజ్ అయ్యి రెండు వారాలు దాటిపోయినా కలెక్షన్ల వరద మాత్రం ఆగడం లేదు.

RRR: ఆర్ఆర్ఆర్ సీక్వెల్.. ఎలా చూసినా కుదిరేలా లేదుగా!

బాక్సాఫీస్ వద్ద మరే ఇతర పెద్ద సినిమా లేకపోవడం.. వచ్చినా నిలవకపోవడంతో రిలీజ్ అయిన అన్ని భాషల్లోనూ ఆర్ఆర్ఆర్ చిత్రానికి జనం బ్రహ్మరథం పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలోనే పలు కొత్త రికార్డులను తన పేరిట రాసుకుంటూ వెళ్తోంది ఈ మూవీ. ఇందులో నటించిన ఎన్టీఆర్, చరణ్, దర్శకుడు రాజమౌళిలకు బాలీవుడ్, హాలీవుడ్ నుండి కూడా ప్రశంసల వర్షం కురుస్తుంది. అయితే.. ఇదే సమయంలో చరణ్-తారక్ లో ఎవరు బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చారనే చర్చలు కూడా సహజంగా వినిపిస్తూనే ఉన్నాయి.

RRR: ఎన్టీఆర్-చరణ్ డామినేషన్ వార్.. నోళ్లు మూయించిన ఆన్సర్!

బెస్ట్ పరఫార్మెర్ ఎవరన్నా దానిపై జక్కన్నకు కూడా ప్రశ్నలు ఎదురవగా.. ఎవరికి వాళ్ళు ది బెస్ట్ అంటూ రాజమౌళి కితాబిస్తూ వచ్చాడు. అయితే.. తాజాగా జక్కన్న హాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాత్రం ఆర్ఆర్ఆర్ లో ఒక సీన్ లో తారక్ తాను ఊహించిన దానికంటే బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చాడని ప్రశంసించాడు. సినిమాలో పెద్ద హిట్ అయ్యిన కొమురం భీముడో సాంగ్ కి ఎన్టీఆర్ నన్ను ఆశ్చర్యపరిచాడని.. అందులో నేను ఊహించిన దానికంటే బెటర్ పర్ఫామెన్స్ ఇచ్చి అదరగొట్టాడని రాజమౌళి తెలిపాడు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.