Jr NTR: రెండు రోజుల్లో తారక్ బర్త్ డే.. ఆతృతగా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్!

ఇంకో రెండు రోజుల్లో ఎన్టీఆర్ బర్త్ డే.. ఈ సారి ఫ్యాన్స్ హంగామా మామూలుగా ఉండదు.. ఎందుకంటే ట్రిపుల్ ఆర్ సక్సెస్ తో తారక్ పాన్ ఇండియా స్టార్ అయిన తర్వాత రాబోతున్న ఫస్ట్ బర్త్ డే.. అంటే ఏ రేంజ్ సెలబ్రేషన్స్ ఉంటాయో ఊహించుకోండి.

Jr NTR: రెండు రోజుల్లో తారక్ బర్త్ డే.. ఆతృతగా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్!

Jr Ntr

Jr NTR: ఇంకో రెండు రోజుల్లో ఎన్టీఆర్ బర్త్ డే.. ఈ సారి ఫ్యాన్స్ హంగామా మామూలుగా ఉండదు.. ఎందుకంటే ట్రిపుల్ ఆర్ సక్సెస్ తో తారక్ పాన్ ఇండియా స్టార్ అయిన తర్వాత రాబోతున్న ఫస్ట్ బర్త్ డే.. అంటే ఏ రేంజ్ సెలబ్రేషన్స్ ఉంటాయో ఊహించుకోండి. ఇక ఫిలిం ఇండస్ట్రీ లో ఎప్పటి నుంచో తారక్ చుట్టూ చర్చ నడుస్తోంది. తారక్ అప్ కమింగ్ సినిమాలపై కన్ ఫ్యూజ్ కొనసాగుతూనే ఉంది. తారక్ బర్త్ డే రోజైనా ఆయన సినిమలపై క్లారిటీ వస్తుందా.. అనేదే ఇప్పుడు హాట్ టాపిక్.

Jr NTR: డొనేట్ ఏ మీల్.. సేవలో తారక్ ఫ్యాన్స్ అరుదైన రికార్డ్!

ఎన్టీఆర్-రాంచరణ్ కాంబినేషన్‌లో వచ్చిన ట్రిపుల్ఆర్.. వరల్డ్ వైడ్‌గా అదరగొట్టింది. రికార్డ్ కలెక్షన్లు రాబట్టింది. మే 20న ఓటీటీలో రిలీజ్‌కు రెడీ అయినా.. ఇప్పటికీ థియేటర్స్‌లో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇలాంటి హాపీ మూమెంట్ లో మే 20నే ఎన్టీఆర్ బర్త్ డే. గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలన్న ఫుల్ ఎగ్జైట్ మెంట్ తో ఆయన ఫ్యాన్స్ ఉన్నారు. ఎన్టీఆర్ మాత్రం ఇప్పటికే కొరటాల శివతో ఒక ప్రాజెక్ట్, ప్రశాంత్ నీల్ తో మరో ప్రాజెక్ట్ ఇంకా బుచ్చిబాబు, ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ తో కలిపి నాలుగు ప్రాజెక్ట్ లను ఓకే చేసినట్టు టాక్ నడుస్తున్నా, ఏ సినిమా ఎప్పుడు పట్టాలెక్కిస్తున్నాడో ఇంత వరకు క్లారిటీ ఇవ్వలేదు.

Jr NTR: చిల్ మూడ్ నుండి వర్క్ మూడ్‌లోకి ఎన్టీఆర్.. ఇక దూకుడే!

షూటింగ్ స్పాట్‌లో.. డైరెక్టర్ శంకర్.. చరణ్‌కి ఓ లైన్ వినిపించగా ఆ కథకు.. ఎన్టీఆర్ అయితే.. ఎగ్జాక్ట్‌గా సెట్ అవుతాడని.. శంకర్ తన మదిలో మాటని బయటపెట్టేశారని ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది. ఆ లైన్ విన్న వెంటనే.. చరణ్ కూడా అదే ఫీలై.. వెంటనే తారక్‌కి ఈ విషయం చెప్పి.. డైరెక్టర్ శంకర్‌తో మీటింగ్ ఏర్పాటు చేయగా.. శంకర్ చెప్పిన లైన్ విన్నాక.. ఎన్టీఆర్ కూడా ఎగ్జైట్ అయినట్టు.. టాక్ వినిపిస్తోంది. దాంతో డైరెక్టర్ శంకర్ త్వరలోనే మొత్తం స్టోరీ నేరేట్ చేస్తానని.. చెప్పినట్లు ఇండస్ట్రీ టాక్. ప్రస్తుతం.. శంకర్.. రాంచరణ్ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇంకా.. ఇండియన్-2, అపరిచితుడు హిందీ రీమేక్ ప్రాజెక్ట్ చేయాల్సి ఉంది. ఆ తర్వాతే ఎన్టీఆర్‌తో శంకర్ సినిమా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది.

Jr NTR: ఇక జాతరే.. ఫ్యాన్స్‌లో జోష్ పెంచుతున్న తారక్ మూవీ లైనప్

ఎన్టీఆర్.. కొరటాల శివతో చేయబోయే సినిమా.. ఎప్పుడో మొదలకావాల్సింది. ఆచార్య రిజల్ట్ తర్వాత కొరటాల శివ మరింత కేర్ ఫుల్ గా తారక్ సినిమా స్క్రిప్ట్ మీదే మళ్లీ వర్క్ చేస్తున్నట్టు టాక్ నడిచింది. కనీసం ఈ బర్త్ డే రోజైనా ఈ సినిమా నుంచి మేజర్ అప్డేట్ ఉండాలని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఆరోజు ఖచ్చితంగా ఎన్టీఆర్ కొరటాల శివ ప్రాజెక్ట్ కు సంబంధించి మోషన్ పోస్టర్ రిలీజ్ అవుతుందని హోప్స్ పెట్టుకున్నారు.

Jr NTR-Prasanth Neel: తారక్, ప్రశాంత్ వైరల్ పిక్.. సెలబ్రేషన్ అసలు రీజన్ ఏంటంటే?

ఆ తర్వాత.. ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తారక్ సినిమా ఉంటుందనుకున్నారు ఫ్యాన్స్ . కాని, కేజిఎఫ్ 2 ప్రొడ్యూసర్స్ కేజిఎఫ్ ఫ్రాంచైజీ అనౌన్స్ చేసి, కేజిఎఫ్ 3 షెడ్యూల్ ప్రకటించే సరికి ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ సినిమాపై కన్ ఫ్యూజన్ క్రియేట్ అయింది. అంతకు ముందే ప్రకటించిన ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు కూడా ఎన్టీఆర్ తో స్పోర్ట్స్ డ్రామా సినిమా చేయాల్సి ఉంది. కాని, ఇప్పటి దాకా ఈ ప్రాజెక్ట్ పైన కూడా ఏ అప్ డేట్ ఇవ్వలేదు. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు, కామన్ ఆడియన్స్ కూడా ఇందులో ఏ ప్రాజెక్ట్ ఉంటుందో, ఏ ప్రాజెక్ట్ ఉండదో అర్థం కాక కన్ ఫ్యూజ్ అవుతున్నారు. తారక్ బర్త్ డే రోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉండటంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు తారక్ ఫ్యాన్స్.