NTR: అభిమానికి తారక్ ధీమా.. ఫిదా అవుతున్న నెటిజన్లు!

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఈ పేరు కొన్ని కోట్లాది మంది గుండెల్లో అభిమానాన్ని సంపాదించుకుంది. ఎన్టీఆర్ సినిమా వస్తుందంటే థియేటర్ల వద్ద సందడి చేసే ఫ్యాన్స్ కొందరు ఉంటే.....

NTR: అభిమానికి తారక్ ధీమా.. ఫిదా అవుతున్న నెటిజన్లు!

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఈ పేరు కొన్ని కోట్లాది మంది గుండెల్లో అభిమానాన్ని సంపాదించుకుంది. ఎన్టీఆర్ సినిమా వస్తుందంటే థియేటర్ల వద్ద సందడి చేసే ఫ్యాన్స్ కొందరు ఉంటే.. ఆయనపై అభిమానంతో సేవా కార్యక్రమాలు చేసే వారు మరికొందరు. అయితే మిగతా హీరోలకంటే తారక్ అంటే తమకు ఎందుకు ఎక్కువ అభిమానం అని అడిగితే, వారు సమాధానం చెప్పలేరు. కానీ.. తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్న ఓ వీడియో దీనికి నిదర్శనం అని వారు కాలర్ ఎగరేసి మరీ చెబుతున్నారు.

NTR: మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెడుతున్న తారక్..?

తారక్ అభిమాని అయిన శ్రీకాళహస్తికి చెందిన జనార్ధన్ అనే వ్యక్తి ఇటీవల ఓ యాక్సిడెంట్‌లో గాయపడి కోమాలోకి వెళ్లిపోయాడు. తమ కుమారుడిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్న తల్లిదండ్రులు ఎన్నివిధాలుగా ప్రయత్నించినా, జనార్ధన్ మాత్రం రెస్పాండ్ కావడం లేదు. దీంతో డాక్టర్లు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. అయితే జనార్ధన్‌కు ఎన్టీఆర్ అంటే ప్రాణం. ఆయన పేరును పలికినప్పుడు మాత్రమే జనార్ధన్ రెస్పాండ్ అవుతున్నాడట. ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ అభిమానులు కొందరు ఆసుపత్రికి చేరుకుని, జనార్ధన్ తల్లితో మాట్లాడారు. అతడి పరిస్థితిని చూసి వారు తమ అభిమాన హీరో ఎన్టీఆర్‌కు ఫోన్ చేశారు.

ఎన్టీఆర్ కూడా తన అభిమాని పరిస్థితి గురించి ఆరా తీసి అన్ని విషయాలను కనుకున్నాడు. అంతేగాక జనార్ధన్ తల్లితో తమ కుటుంబానికి తాను అండగా ఉంటానని ధీమా ఇచ్చాడు. కోమాలో ఉన్న జనార్ధన్‌తో తారక్ ఫోన్ స్పీకర్ ద్వారా మాట్లాడి, అతడు త్వరగా కోలుకోవాలని కోరుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన అభిమానికి ప్రమాదం జరిగిందని తెలుసుకుని ఆ కుటుంబాన్ని ఓదార్చిన తారక్‌కు నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.