రోడ్డు ప్రమాదంలో మా నాన్న, అన్నని కోల్పోయాను.. ఎమోషనల్ అయిన ఎన్టీఆర్..

రోడ్డు ప్రమాదంలో మా నాన్న, అన్నని కోల్పోయాను.. ఎమోషనల్ అయిన ఎన్టీఆర్..

Jr NTR: సైబరాబాద్ పోలీస్ పెట్రోలింగ్ వాహ‌నాల‌ను సినీన‌టుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. ప్ర‌స్తుతం కొన‌సాగుతోన్న జాతీయ రహదారి భద్రత మాసంలో భాగంగా సైబరాబాద్ సీపీ స‌జ్జ‌నార్ నేతృత్వంలో ప్రత్యేక కార్యక్ర‌మాన్ని నిర్వ‌హించారు. అలాగే, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల వార్షిక సమావేశం కూడా జ‌రుపుతున్నారు. దీనికి అతిథిగా ఎన్టీఆర్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘‘ఈరోజు ఈ కార్యక్రమంలో నేను నటుడుగా కాదు. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యుల్లో భాదితుడుని. రోడ్డు ప్రమాదంలో నా కుటుంబంలో నా అన్న, నా తండ్రి హరికృష్ణ ని కోల్పోయాను. 33 వేల కిలోమీటర్లు మా తాత గారు పర్యటనలో ఎంతో జాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ మా నాన్న గారు తీసుకెళ్లారు..

అలాంటి వ్యక్తి అర్థాంతరంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కాబట్టి ఇంటి నుండి బయటికి వెళ్లే టప్పుడు మన కోసం ఎదురుచూసే ఇంట్లో వాళ్ళని గుర్తు పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి. అత్యంత ప్రమాదకరమైన కోవిడ్‌కి వ్యాక్సిన్ ఉంది కానీ, ఇలాంటి రోడ్డు ప్రమాదాలకు వ్యాక్సిన్ లేదు.. మీ కోసం మీ కుటుంబం కోసం బాధ్యతాయుతంగా ఉండాలని కోరుకుంటున్నాను..

మన దేశానికి పహారా కాస్తున్న సైనికుల, మన ఇంటి పక్కనే పహారా కాస్తున్న పోలుసుల సేవలు అందరూ గుర్తించాలి..
మన తల్లిదండ్రులను ఏవిధంగా అయితే గౌరవిస్తామో అలాగే మన పోలీస్ డిపార్ట్ మెంట్‌ను కూడా ఓ పౌరుడుగా గుర్తించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.