Jr NTR – Puneeth- RRR : భావోద్వేగంతో పునీత్ పాట చివరిసారి పాడిన ఎన్టీఆర్

పునీత్ రాజ్ కుమార్ నాకు చాలా మంచి ఫ్రెండ్. తన కోసం గెలయా పాటను చివరిసారి పాడుతున్నా అంటూ...

Jr NTR – Puneeth- RRR : భావోద్వేగంతో పునీత్ పాట చివరిసారి పాడిన ఎన్టీఆర్

Jr NTR – Puneeth- RRR : తన బెస్ట్ ఫ్రెండ్ పునీత్ రాజ్ కుమార్ ను తల్చుకుని మరోసారి ఎమోషనల్ అయ్యాడు జూనియర్ ఎన్టీఆర్. డిసెంబర్ 10, 2021 శుక్రవారం నాడు బెంగళూరులో RRR ప్రమోషనల్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రోగ్రామ్ లో హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, హీరోయిన్ ఆలియా భట్, దర్శకుడు రాజమౌళి, ప్రొడ్యూసర్లు పాల్గొన్నారు.

Also Read : RRR : ‘ఆర్ఆర్ఆర్’ హిందీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు స్పెషల్ ట్రైన్‌లో 3000 మంది అభిమానులు

హైదరాబాద్ లో భారీగా వచ్చిన ఫ్యాన్స్ కారణంగా హీరోలు ప్రమోషనల్ ఈవెంట్ లో పాల్గొనలేకపోయారని డైరెక్టర్ రాజమౌళి చెప్పాడు. ఐతే… మిగతా నగరాల్లో, త్వరలోనే హైదరాబాద్ లో నిర్వహించబోయే ప్రెస్ మీట్లలో హీరోలు కూడా పాల్గొంటారన్నాడు. బెంగళూరులో టీమ్ అంతా కలిసి ప్రమోషన్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా క్వశ్చన్ ఆన్సర్ లో భాగంగా… పునీత్ రాజ్ కుమార్ గురించి గుర్తుచేసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్.

Read Also : RRR Trailer: ఆ రెండు ఫ్రేమ్‌లు చాలు.. చరణ్, ఎన్టీఆర్.. చంపేశారంతే..!

పునీత్ రాజ్ కుమార్ నటించిన చక్రవ్యూహ సినిమా కోసం తారక్ 2016లో ఓ పాట పాడారు. అది సూపర్ డూపర్ హిట్టయింది. గెలయా గెలయా అంటూ సాగే ఈ పాటను.. ఎన్టీఆర్-పునీత్ మధ్య ఫ్రెండ్ షిప్ కు గుర్తుగా పాడుకుంటుంటారు ఫ్యాన్స్. ఐతే.. ఈ ప్రమోషనల్ ఈవెంట్ లో పునీత్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ పాటనే గుర్తుచేసుకున్నాడు. “పునీత్ రాజ్ కుమార్ నాకు చాలా మంచి ఫ్రెండ్. ఆయన కోసం గెలయా పాటను చివరిసారి పాడుతున్నా.” అంటూ భావోద్వేగంతోనే పాట పాడారు. ఎన్టీఆర్ ఇచ్చిన రెస్పెక్ట్ కు టీమ్, సహా జర్నలిస్టులు అంతా చప్పట్లతో అభినందించారు.