సీఎం.. సీఎం నినాదాలు.. ఆగండి బ్రదర్ అంటూ ఎన్టీఆర్ అసహనం

సీఎం.. సీఎం నినాదాలు.. ఆగండి బ్రదర్ అంటూ ఎన్టీఆర్ అసహనం

Jr NTR:యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌కు మరోసారి పొలిటికల్‌ సెగ తగిలింది. ఎన్టీఆర్‌ సీఎం అంటూ.. ఆయన అభిమానులు మరోసారి హంగామా చేశారు. దీంతో ఫ్యాన్స్‌ను మందలించారు ఎన్టీఆర్‌. తెల్లవారితే గురువారం సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు ఎన్టీఆర్‌ హాజరయ్యారు. ఈ సంధర్భంగా.. ఎన్టీఆర్ మాట్లాడటం మొదలుపెట్టగానే అభిమానులు నినాదాలు చేశారు.

ఎన్టీఆర్ సీఎం అంటూ అరుస్తూనే ఉండడంతో.. ఎన్టీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ఇది కుటుంబ వేడుక అంటూ ఫ్యాన్స్‌కు సర్దిచెప్పారు. ఆగండి బ్రదర్ అంటూ అభిమానుల స్లోగన్స్‌కు బ్రేక్ వేశారు. ఎన్టీఆర్‌ గట్టిగా మందలించడంతో నినాదాలు ఆపేశారు అభిమానులు.

ఇదే వేదికపై ఎన్టీఆర్‌ మాట్లాడుతూ.. ‘నాకు ఇరవయేళ్ల నుంచి దేవుడిచ్చిన శక్తి మీరైతే.. దేవుడిచ్చిన కుటుంబం జక్కన్న, కీరవాణి కుటుంబం. నా జీవితంలో తీసుకున్న ఎన్నో నిర్ణయాల వెనుక ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో వీళ్లు ఉంటారు. ఈ కుటుంబానికి నేనెప్పుడూ అతిథిని కాను. నేనూ వాళ్ల కుటుంబ సభ్యుడిగానే భావిస్తాను. అంటూ చెప్పుకొచ్చారు.