RRR: గయ్యాళి అత్త సుమ.. నోరు లేని భర్త రాజీవ్.. తారక్ ఫన్నీ కామెంట్స్!

మార్చ్ 25.. డేట్ దగ్గరపడుతున్న కొద్దీ ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ పీక్స్ కు చేరుకుంటున్నాయి. చిత్ర యూనిట్ అంతా భారీ స్థాయి ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఏదైనా ఒక పద్ధతి..

RRR: గయ్యాళి అత్త సుమ.. నోరు లేని భర్త రాజీవ్.. తారక్ ఫన్నీ కామెంట్స్!

Rrr(1)

RRR: మార్చ్ 25.. డేట్ దగ్గరపడుతున్న కొద్దీ ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ పీక్స్ కు చేరుకుంటున్నాయి. చిత్ర యూనిట్ అంతా భారీ స్థాయి ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఏదైనా ఒక పద్ధతి ప్రకారం చూసుకొనే రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ మల్టీస్టారర్ సినిమాకి మరింత పగడ్బంధీగా ప్రమోషన్ ఏర్పాటు చేశారు. ఒక షెడ్యూల్ ప్రకారం దర్శకుడు రాజమౌళి, హీరోలు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేశ వ్యాప్తంగా సినిమా ప్రమోషన్స్ లో మునిగిపోయారు.

RRR: ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌లో విజయేంద్ర ప్రసాద్ ఎక్కడ..?

ప్రమోషన్స్ లో భాగంగా తెలుగు టాప్ యాంకర్ సుమతో రాజమౌళి-రామారావు-రామ్ చరణ్ ఒక ఇంటర్వ్యూ చేశారు. ఇందులో ఎన్టీఆర్ సుమపై పంచులు పంచులు వేశారు. ముందుగా నీ గొంతేంటి గీరపోయింది.. వాగి వాగి అలా అయిపోయిందా అంటూ ఎన్టీఆర్ సుమను అడిగాడు. ఒక నెల గ్యాప్ వచ్చింది కానీ.. నువ్వు కూడా నాకంటే ఎక్కువగానే మాట్లాడేస్తున్నావ్.. పైగా తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మలయాళం తప్ప అన్నీ కవర్ చేస్తున్నావ్ అంటూ సుమ రిటర్న్ పంచ్ వేసింది. మలయాళం నువ్వు ఉన్నావ్ కదా అని వదిలేశా అని తారక్ కామెంట్ చేశాడు.

RRR : సుమకి చాదస్తం ఎక్కువ.. ఎప్పుడో పుట్టింది.. ఎన్టీఆర్ కామెంట్స్

అప్పుడెప్పుడో కన్నాంబ టైం నుండి వాగుతున్నా ఆ మాత్రం గొంతు గీరపట్టదా అంటూ సుమ ఫన్నీగా చెప్పగా.. ఎన్టీఆర్ అంతకు ముందు కీరవాణితో ఇంటర్యూ గుర్తుచేశాడు. అందులో సుమ గయ్యాళి నోరేసుకొని పడిపోద్ది అని.. సుమకి బాగా మంచి ముసలమ్మ రోల్ ఇవ్వాలి. ఓ నాయనమ్మో, అమ్మమ్మో.. సుమకి బాగా చాదస్తం ఉంది. ఒకప్పుడు మనకి నిర్మలమ్మ గారు ఉన్నారు, కానీ ఈ రోజు లేరు. ఛాయాదేవి గారు, సూర్య కాంతం గారు, నిర్మలమ్మ గారు ఇలా నోరేసుకొని పడిపోయే గయ్యాళి క్యారెక్టర్స్ లో సుమ సెట్ అవుతుందని చెప్పానని ఎన్టీఆర్ సుమకి చెప్పాడు.

RRR: తెలుగులో లేనిది హిందీలో ఏముంది?

చూశా.. అన్నీ చూశా అంటూ సుమ మాట్లాడుతుండగానే.. గయ్యాళి అత్త పాత్రలో సుమ చేసే సినిమాలోనే రాజీవ్ కూడా ఉండాలి. కాకపోతే నోరు పడిపోయిన మొగుడుగా ఉండాలని సెటైర్లు వేశాడు. దానికి సుమ కూడా ఆహా రాజా వినడానికి ఇది ఎంత బాగుందో అంటూ సుమ ఎంజాయ్ చేసింది.