జూ.ఎన్టీఆర్‌కు కరోనా పాజిటివ్

కొవిడ్-19 టెస్టు చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది. బాధపడకండి. నేను బాగానే ఉన్నా. ఫ్యామిలీతో పాటు నేను ఐసోలేషన్ లో ఉన్నాం. డాక్టర్ల సూపర్‌విజన్‌లోనే ఉన్నాం.

జూ.ఎన్టీఆర్‌కు కరోనా పాజిటివ్

Jr Ntr Tests Positive For Covid19

సినీ నటుడు జూ.ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. కొద్ది రోజులుగా మాస్క్ పెట్టుకోండి, వ్యాక్సిన్ వేయించుకోండి. వైరస్ వ్యాప్తిని అడ్డుకుని దేశాన్ని కాపాడంటూ విస్తృతంగా ప్రచారం చేస్తున్న ఎన్టీఆర్ కు కరోనా రావడంతో అభిమానులతో పాటు సినీ ప్రపంచం అంతా ఆయన కోలుకోవాలని కోరుకుంటున్నారు.

ఈ మేరకు జూ.ఎన్టీఆర్ స్వయంగా ట్విట్టర్ లో ఈ విషయాన్ని పోస్టు చేసి వెల్లడించారు. ‘కొవిడ్-19 టెస్టు చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది. బాధపడకండి. నేను బాగానే ఉన్నా. ఫ్యామిలీతో పాటు నేను ఐసోలేషన్ లో ఉన్నాం. డాక్టర్ల సూపర్‌విజన్‌లోనే ఉన్నాం. నాతో కొద్ది రోజుల క్రితం వరకూ కలిసిన వారంతా టెస్టులు చేయించుకోండి. సేఫ్ గా ఉండండి’ అంటూ పోస్టు పెట్టారు.