Jr NTR : తారక్ లుక్ కిరాక్..

సూట్‌లో డిఫరెంట్ డ్రెస్సింగ్ స్టైల్‌లో సరికొత్త తారక్ లుక్ కిరాక్ అంటున్నారు నెటిజన్లు..

Jr NTR : తారక్ లుక్ కిరాక్..

Jr Ntr

Jr NTR: ‘ఆట నాది.. కోటి మీది.. రండి గెలుద్దాం’.. అంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలో స్మాల్ స్క్రీన్ మీద సందడి చెయ్యబోతున్నారు. ‘బిగ్ బాస్’ ఫస్ట్ సీజన్ హోస్ట్ చేసి.. సిల్వర్ స్క్రీన్ అయినా, స్మాల్ స్క్రీన్ అయినా.. ఫ్రేమ్ పెడితే క్యారెక్టర్‌లోకి ఇన్‌వాల్వ్ అయిపోయి తన పర్ఫార్మెన్స్‌తో చెలరేగిపోతాడు అని ప్రూవ్ చేశాడు తారక్.

Komaram Bheem NTR : గోండు బెబ్బులి గాండ్రింపు.. ‘ఆర్ఆర్ఆర్’ నుండి యంగ్ టైగర్ న్యూ పోస్టర్..

కొంత గ్యాప్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో ను హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్‌కి గ్యాప్ రావడంతో ఎన్టీఆర్ మీద ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కొత్త ప్రోమోలతో కొన్ని ఎపిసోడ్స్ షూట్ చేశారు. సెట్లో నుండి బయటకొచ్చిన తారక్ పిక్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.

Jr.Ntr : ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కోసం ఎన్టీఆర్ వేసుకున్న బ్లేజర్ రేటు ఎంతంటే…

సూట్‌లో డిఫరెంట్ డ్రెస్సింగ్ స్టైల్‌లో సరికొత్త తారక్ లుక్ కిరాక్ అంటున్నారు నెటిజన్లు.. ఫ్యాన్స్ అయితే ఈ పిక్‌ని సోషల్ మీడియాలో తెగ షేర్ చేసేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ‘ఆర్ఆర్ఆర్’ షూట్ కంప్లీట్ చేసేసి, ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ బ్యాలెన్స్ ఎపిసోడ్స్ పూర్తి చెయ్యనున్నారు యంగ్ టైగర్. త్వరలో టెలికాస్ట్ డీటెయిల్స్ వెల్లడించనున్నారు నిర్వాహకులు. వినోదం, విజ్ఞానంతో పాటు ఎమోషనల్‌గానూ ఈ షో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.

RRR UK Schedule : ఎండ్ కొచ్చేసరికి ఎనర్జీ ట్రిపుల్ అయ్యిందిగా..