Jr NTR: తారక్ నష్టనివారణ చర్యలు.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు

ట్రిపుల్ఆర్ పోస్ట్ పోన్ తో ఎంత కాదనుకున్నా ఎక్కువ నష్టపోయింది ఎన్టీఆరే అంటున్నారు ఫాన్స్. మూడేళ్లుగా ట్రిపుల్ఆర్ కోసం కమిటెడ్ గా ఉన్న ఎన్టీఆర్.. ఇప్పుడు నష్టనివారణా చర్యలు..

Jr NTR: తారక్ నష్టనివారణ చర్యలు.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు

Jr Ntr

Jr NTR: ట్రిపుల్ఆర్ పోస్ట్ పోన్ తో ఎంత కాదనుకున్నా ఎక్కువ నష్టపోయింది ఎన్టీఆరే అంటున్నారు ఫాన్స్. మూడేళ్లుగా ట్రిపుల్ఆర్ కోసం కమిటెడ్ గా ఉన్న ఎన్టీఆర్.. ఇప్పుడు నష్టనివారణా చర్యలు చేపట్టారు. ట్రిపుల్ఆర్ లాస్ ని మిగతా సినిమాలతో కవర్ చేద్దామని నెక్ట్స్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాల మీద ఫోకస్ చేస్తున్నారు ఎన్టీఆర్. 2022ని సరికొత్తగా ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్రాండ్ గాస్టార్ట్ చేద్దామనుకున్నారు ఎన్టీఆర్. ట్రిపుల్ ఆర్ తో నెక్ట్స్ లెవల్ కి వెళదామనుకున్న ఎన్టీఆర్ కోరిక ప్రస్తుతానికి పోస్ట్ పోన్ అయ్యింది.

NBK 107: క్రాక్ కాంబినేషన్ రిపీట్.. బాలయ్య కోసం జయమ్మ ఫిక్స్!

ఇప్పటికే మూడేళ్లుగా ట్రిపుల్ఆర్ మీదే ఉన్న ఎన్టీఆర్.. ఇప్పుడు టైమ్ వేస్ట్ చేస్కోదలచుకోవడం లేదు. అందుకే ఒకేసారి సైమల్టేనియస్ గా రెండు సినిమాలు చెయ్యడానికి రెడీ అవుతున్నారు. ఎన్టీఆర్ ప్రజెంట్ 2 సినిమాలు చేద్దామని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. ఆల్రెడీ కొరటాల శివతో రెండోసారి టీమప్ అవుతున్న ఎన్టీఆర్.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ తో పాటు.. మరో సినిమా కూడా సెట్స్ మీదకి తీస్కురావడానికి ప్లాన్ చేస్తున్నారు. జనతా గ్యారేజ్ తో మంచి సక్సెస్ అయిన కొరటాల, ఎన్టీఆర్ సినిమా సంక్రాంతికి స్టార్ట్ చేసి ఆచార్య సినిమా రిలీజ్ అయ్యాక రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడదామని ప్లాన్ చేస్తున్నారు.

Atithi Devo Bhava: నానీ చేతుల మీదుగా ఆది ‘అతిధి దేవోభవ’ ట్రైలర్!

కొరటాలతో సినిమా కంటిన్యూ చేస్తూనే.. ఎన్టీఆర్ మరో సినిమా స్టార్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ బుచ్చిబాబు చెప్పిన స్టోరీకి ఇంప్రెస్ అయిన ఎన్టీఆర్.. బుచ్చికి ఓకే చెప్పే ఆలోచనలో ఉన్నారని టాక్. అంతేకాదు.. ఆల్రెడీ లైన్లోనే ఉన్న ప్రశాంత్ నీల్ సినిమాకైనా జంప్ అయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి. అయితే ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్నాడు కాబట్టి.. మ్యాగ్జిమమ్ బుచ్చిబాబు సినిమాకే గ్రీన్ సిగ్నల్ ఇస్తారని టాలీవుడ్ టాక్.