Jr NTR: ఎక్స్‌పెరిమెంట్స్ జోలికెళ్లని తారక్.. పక్కా సేఫ్ గేమ్!

టాలీవుడ్ హీరోలందరూ మారిపోతున్నారు. యంగ్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్న చిరంజీవి దగ్గరనుంచి.. ఈ మధ్యనే సేఫ్ జోన్ లో నుంచి బయటికొచ్చి అప్ కమింగ్ డైరెక్టర్ తో సినిమా కమిట్ అయిన..

10TV Telugu News

Jr NTR: టాలీవుడ్ హీరోలందరూ మారిపోతున్నారు. యంగ్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్న చిరంజీవి దగ్గరనుంచి.. ఈ మధ్యనే సేఫ్ జోన్ లో నుంచి బయటికొచ్చి అప్ కమింగ్ డైరెక్టర్ తో సినిమా కమిట్ అయిన సూపర్ స్టార్ వరకూ అందరూ ఎక్స్ పెరిమెంట్స్ చెయ్యడానికి రెడీ అవుతున్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఇంకా అలవాటైన డైరెక్టర్లతో, అచ్చొచ్చిన కథలతో అలాగే కంటిన్యూ అవుతున్నాడు. ఇంతకీ ఎన్టీఆర్ సేఫ్ జోన్ లో నుంచి బయటికొచ్చేదెప్పుడు..?

Sankranti 2022: ఆ నలుగురు.. సైడిస్తారా..? ఢీ కొడతారా..?

స్టార్ హీరో ఎన్టీఆర్ ఈ మధ్య సినిమా సినిమాకి బాగా గ్యాప్ తీసుకుంటున్నాడు. అప్పుడెప్పుడో అరవింద సమేత చేసిన ఎన్టీఆర్ ట్రిపుల్ కమిట్ అయ్యి రాజమౌళికి మూడేళ్లు బుక్కయిపోయాడు. వేరే సినిమా చేసేఛాన్స్ లేకుండా ఇరుక్కుపోయాడు. 30 సినిమాలకు దగ్గరలో ఉన్న ఎన్టీఆర్ ఇప్పటి వరకూ సేప్ గేమ్ అడుతూ వస్తున్నాడు. కొత్త డైరెక్టర్ల జోలికి పోకుండా అలవాటైన డైరెక్టర్లతోనే సినిమాలు చేస్తున్నాడు.

Sankranti 2022: సంక్రాంతికి ధియేటర్లో సినిమాల దండయాత్ర!

టాలీవుడ్ లో ఈ మద్య అందరూ ఎక్స్ పెరిమెంట్స్ చేస్తున్నారు. యంగ్ హీరోల దగ్గరనుంచి ఎస్టాబ్లిష్డ్ స్టార్ల వరకూ అందరూ ప్రయోగాలు చేస్తున్నారు. కొత్త డైరెక్టర్లతో, కొత్త జానర్స్ తో, కొత్త కొత్త లుక్స్ లో ఆడియన్స్ కి సరికొత్తగా కనిపిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత యంగ్, అప్ కమింగ్ డైరెక్టర్లతో ఎక్కువగా సినిమాలు కమిట్ అవుతున్నాడు. ఆఖరికి ఎప్పుడూ పెద్దగా ప్రయోగాల జోలికెళ్లని మహేష్ బాబు కూడా పరశురామ్ తో సర్కారు వారి పాట చేస్తూ సర్ ప్రైజ్ చేశాడు. చరణ్, బన్నీ, పవన్ కళ్యాణ్, నాని, ఇలా అందరూ కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇస్తున్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఇంకా సేఫ్ జోన్ లోనే సినిమాలు చేస్తున్నాడు.

Telugu Films Releases: టార్గెట్ డిసెంబర్.. అందరి చూపు ఈనెలపైనే!

ఎన్టీఆర్ అలవాటైన డైరెక్టర్లతోనే ట్రావెల్ చెయ్యడానికి ఇష్టపడుతున్నాడు. త్రివిక్రమ్ తో అరవిందసమేత చేసిన ఎన్టీఆర్.. ట్రిపుల్ ఆర్ తరవాత నెక్ట్స్ మూవీని కొరటాలతోనే అనౌన్స్ చేశారు. ప్రజెంట్ రిలీజ్ కు రెడీగా ఉన్న ట్రిపుల్ ఆర్ డైరెక్టర్ కూడా తనకు బాగా క్లోజ్ అయిన అంతకుముందు సూపర్ హిట్స్ ఇచ్చిన డైరెక్టరే. ట్రిపుల్ ఆర్ తర్వాత తెరకెక్కబోతున్న సినిమా కొరటాల డైరెక్షన్లో చేస్తున్నదే. కొరటాలతో అంతకుముందు జనతా గ్యారేజ్ చేశాడు ఎన్టీఆర్. ఇలా అలవాటైన, హిట్ ట్రాక్ లో ఉన్న డైరెక్టర్లతోనే సినిమాలు చేస్తున్నాడు. కానీ కొత్త డైరెక్టర్ తో సినిమా చేసే ఆలోచన చెయ్యడం లేదు. మరి ఎన్టీఆర్ సేఫ్ జోన్ లో నుంచి బయటికి తీసుకొచ్చే ఆ డైనమిక్ డైరెక్టర్ ఎవరో.. తెలియాలంటే ఇంకా వెయిట్ చెయ్యాల్సిందే.