Balakrishna – Jr NTR : నందమూరి ఫ్యాన్స్‌‌కి గుడ్‌న్యూస్.. త్వరలో ఒకే వేదికపై బాబాయ్-అబ్బాయ్..

త్వరలో నటసింహా బాలకృష్ణ - యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తమ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారు..

Balakrishna – Jr NTR : నందమూరి ఫ్యాన్స్‌‌కి గుడ్‌న్యూస్.. త్వరలో ఒకే వేదికపై బాబాయ్-అబ్బాయ్..

Balakrishna Jr Ntr

Balakrishna – Jr NTR: నటసింహా నందమూరి బాలకృష్ణ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలో ఒకే వేదికపై కలిసి కనిపించబోతున్నారు అనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో విపరీతంగా స్ప్రెడ్ అవుతోంది. బాలయ్య హోస్ట్ చేస్తున్న ‘అన్‌స్టాపబుల్ విత్ యన్‌బికె’ షో కి తారక్ గెస్ట్‌గా రాబోతున్నాడన్న వార్త కూడా కొద్ది రోజులుగా వినిపిస్తోంది.

Akhanda Trailer Roar : ఇదీ బాలయ్య మాస్ ర్యాంపేజ్!

కట్ చేస్తే జూనియర్ ఎన్టీఆర్ అంతకంటే ముందు బాబాయ్ ‘అఖండ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి గెస్ట్‌గా వస్తున్నాడనే విషయం తెలియడంతో బాబాయ్ – అబ్బాయ్ అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. నవంబర్ 27న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ‘అఖండ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

NTR 30 : తారక్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ఫిబ్రవరిలో పూజ..

కొద్దిరోజుల క్రితం ‘అరవింద సమేత’ సక్సెస్ ప్రోగ్రామ్‌కి బాలయ్య బాబు అతిథిగా వచ్చారు. తర్వాత ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ఫంక్షన్‌కి వచ్చిన తారక్.. తాత, నాన్న, బాబాయ్‌ల గురించి మాట్లాడిన ఎమోషనల్ వర్డ్స్ ఫ్యాన్స్ అంత త్వరగా మర్చిపోలేరు. ఎన్టీఆర్ 2010లో బాలయ్య – బోయపాటి కలయికలో వచ్చిన ఫస్ట్ ఫిలిం ‘సింహా’ ఆడియో విజయోత్సవ వేడుకకు వచ్చాడు.

Simha

 

ఆ ఫంక్షన్‌లో బాబాయ్ మీద ఎంత ప్రేమ ఉందనేది తారక్ మాటల్లో కనిపించింది. ‘చాలా కాలం ఎదురు చూశాం బాబాయ్.. వచ్చేస్తున్నాం.. కొట్టేస్తున్నాం’ అంటూ ‘సింహా’ సూపర్ హిట్ గ్యారంటీ అని చెప్పేసాడు. అన్నట్లుగానే సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు బాలయ్య – బోయపాటి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ ఫిలిం ‘అఖండ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి ఎన్టీఆర్ రాబోతుండడంతో నవంబర్ 27 కోసం నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Manchu Lakshmi ‘అఖండ’ డైలాగులు అదరగొట్టిన మంచు లక్ష్మీ.. వీడియో వైరల్..