NTR: తేజు కోసం మరోసారి ఆ ఫీట్ చేయనున్న తారక్..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈయేడాదిలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో తన సత్తాను యావత్ ప్రపంచానికి చాటి చెప్పాడు. ఇక ఈ సినిమా ఫీవర్ నుండి బయటకు వచ్చిన తారక్, ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు రెడీ అయ్యాడు. కాగా, తారక్ ప్రస్తుతం ఓ మెగా హీరో సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చేందుకు రెడీ అయినట్లుగా తెలుస్తోంది.

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈయేడాదిలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో తన సత్తాను యావత్ ప్రపంచానికి చాటి చెప్పాడు. ఇక ఈ సినిమా ఫీవర్ నుండి బయటకు వచ్చిన తారక్, ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే దర్శకుడు కొరటాల శివతో తారక్ తన కెరీర్‌లోని 30వ చిత్రాన్ని అనౌన్స్ చేయగా, త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను స్టార్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. కాగా, తారక్ ప్రస్తుతం ఓ మెగా హీరో సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చేందుకు రెడీ అయినట్లుగా తెలుస్తోంది.
Sai Dharam Tej: తేజు బర్త్‌డే గిఫ్ట్.. SDT15 నుండి ఇంటెన్స్ పోస్టర్!
మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌తో తారక్‌కు మంచి రిలేషన్, స్నేహం ఉంది. గతంలో తేజు సినిమా ఓపెనింగ్‌కి తారక్ వచ్చి, ఆ సినిమాకు ఆల్ ది బెస్ట్ చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరోసారి సాయి ధరమ్ తేజ్ మూవీకి తారక్ సాయం చేయబోతున్నాడట. తేజు నటిస్తున్న తాజా చిత్రం SDT15 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను డిసెంబర్ 7న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
Sai Dharam Tej : ఆసక్తి రేకెత్తిస్తున్న సాయి ధరమ్ తేజ్ టైటిల్ గ్లింప్స్ పోస్టర్..
అయితే, ఈ టైటిల్ గ్లింప్స్ కోసం తారక్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. హీరో పాత్రను ఇంట్రొడ్యూస్ చేస్తూ తారక్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నాడట. మరి తేజు పాత్రను తారక్ ఎలా ఎలివేట్ చేస్తాడా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఇక ఈ సినిమాను కార్తీక్ దండు డైరెక్ట్ చేస్తుండగా.. సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. మిస్టిక్ థ్రిల్లర్ మూవీగా వస్తున్న ఈ సినిమా కథ ఓ గ్రామంలో జరిగిన కొన్ని ఘటనల ఆధారంగా తెరకెక్కినట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది.