NTR : ‘దేవర’ షూట్ కి బ్రేక్.. ఎన్టీఆర్ వెకేషన్ ఎన్ని రోజులో?

లేట్ గా స్టార్ట్ అయినా ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటున్న 'దేవర' సినిమాకు సంబందించి ఎన్టీఆర్ చిన్న బ్రేక్ తీసుకున్నారు. తాజాగా ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్ళారు.

NTR : ‘దేవర’ షూట్ కి బ్రేక్.. ఎన్టీఆర్ వెకేషన్ ఎన్ని రోజులో?

Jr NTR vacation with Family break to Devara Shoot

Jr NTR Devara : హాట్ హాట్ సమ్మర్ లో నాన్ స్టాప్ షూట్ చేస్తున్న స్టార్లు వెకేషన్ బ్రేక్ తీసుకుంటున్నారు. మొన్నీమధ్య మహేశ్ ఫ్యామిలీతో కలిసి లాంగ్ ఫారెన్ ట్రిప్పుకెళ్లారు. అక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేసి మళ్లీ రీ లోడ్ అయ్యి త్రివిక్రమ్ షూట్ లో జాయిన్ అవ్వడానికి రెడీ అవుతున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా తన టైట్ షెడ్యూల్ నుంచి చిన్న బ్రేక్ తీసుకున్నారు.

లేట్ గా స్టార్ట్ అయినా ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ‘దేవర’ సినిమాకు సంబందించి ఎన్టీఆర్ చిన్న బ్రేక్ తీసుకున్నారు. తాజాగా ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్ళారు. ప్రణతి, అభయ్ రామ్, భార్గవ్ రామ్ తో కలిసి ఎయిర్ పోర్ట్ లో ఎన్టీఆర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ జస్ట్ వారం రోజుల కోసం వెకేషన్ కి వెళ్లారని సమాచారం. పిల్లలకి స్కూల్ రీ ఓపెన్ తో పాటు, దేవర షూట్ కి బ్రేక్ ఇవ్వడంతో జస్ట్ వన్ వీక్ బ్రేక్ తీసుకని ఫారెన్ వెళ్లారు ఎన్టీఆర్.

Nikhil Siddhartha : ఆ సినిమాలకు మోస్ట్ వాంటెడ్ హీరో నిఖిల్.. సైడ్ హీరో నుంచి పాన్ ఇండియా దాకా..

ఎన్టీఆర్ దేవర షూటింగ్ స్పీడ్ గానే జరుగుతోంది. కొరటాల డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ షూటింగ్ లేట్ గా స్టార్ట్ అయినా ఇప్పుడు మాత్రం ఫుల్ పేస్ లో షూట్ జరుగుతోంది. ఎన్టీఆర్ బ్రేక్ తీసుకోవడంతో ఎన్టీఆర్ లేని షూట్స్ కంప్లీట్ చేసే ప్లాన్ లో ఉంది టీమ్. మరి దేవరకు బ్రేక్ ఇవ్వకుండా ఎన్టీఆర్ లేని షూట్ చేస్తారా? బ్రేక్ ఇస్తారా అనేది డౌట్ నడుస్తుంది అభిమానుల్లో. ఇప్పటికే ఈ సినిమా కోసం ఎన్టీఆర్ జిమ్ లో మస్క్యులర్ బాడీ బిల్డప్ చేస్తున్న ఫోటోతో పాటు మొన్నీమధ్య ఫోటో షూట్ తో ఎన్టీఆర్ లుక్ మీద ఇంట్రస్ట్ పెంచేస్తున్నాడు. ఇలాంటి టైంలో బ్రేక్ తీసుకొని వెకేషన్ కి వెళ్లడంతో దేవర గురించి అభిమానులు తొందరగా షూట్ జరగాలని కోరుకుంటున్నారు. ఎన్టీఆర్ టీం సమాచారం ప్రకారం ఎన్టీఆర్ వారం రోజుల్లో వచ్చేస్తారని సమాచారం. చూడాలి మరి ఎన్టీఆర్ దేవరకు ఎన్ని రోజులు బ్రేక్ ఇస్తాడో.