RRR: జులై 15.. ఉదయం 11 గంటలకు.. ఫ్యాన్స్ మీకు పండగే!

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ అభిమానులకు యూనిట్ ఓ శుభవార్త చెప్పింది. జులై 15 ఉదయం 11 గంటలకు ఓ సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. ఈ విషయాన్ని సినిమా యూనిట్ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.

RRR: జులై 15.. ఉదయం 11 గంటలకు.. ఫ్యాన్స్ మీకు పండగే!

Rrr

RRR: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ అభిమానులకు యూనిట్ ఓ శుభవార్త చెప్పింది. జులై 15 ఉదయం 11 గంటలకు ఓ సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. ఈ విషయాన్ని సినిమా యూనిట్ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ఇండియన్ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ నుండి రోర్ ఆఫ్ ‘ఆర్ఆర్ఆర్’ జులై 15న ఉదయం 11 గంటలకు ఒక మేకింగ్ రాబోతుంది అంటూ చిత్రబృందం ఒక పోస్టర్ ను విడుదల చేసింది.

కరోనా సెకెండ్ వేవ్ దెబ్బకు పోస్ట్ ఫోన్ అయిన షూటింగ్ ను ఇటీవలే స్టార్ట్ చేశారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ షూటింగ్ స్పాట్ లో అడుగుపెట్టారంటూ ఆ మధ్య ఓ పోస్టర్ ద్వారా ప్రకటించిన యూనిట్ ఇప్పుడు ఇలా మేకింగ్ వీడియోతో మరోసారి సినిమా షూటింగ్ ఏ రేంజ్ లో జరుగుతుందో చెప్పే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం రామ్ చరణ్ పై కీలక సీన్స్ ను షూట్ చేస్తున్నట్లు తెలుస్తుండగా త్వరలోనే ఎన్టీఆర్ తో భారీ యాక్షన్ సన్నివేశాన్ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో అలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తుండగా అజయ్ దేవగన్, సముద్రఖని, శ్రీయా అలాగే విదేశీ నటీనటులు కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకంఫై దానయ్య దాదాపు నాలుగు వందల కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ ప్యాన్‌ ఇండియా సినిమాకు రాజమౌళి ఆస్థాన సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అసలు కాంబినేషనే భారీ అంచనాలను క్రియేట్ చేస్తే జక్కన్న వదిలే ఒక్కో టీజర్, పోస్టర్ అంతకంతకు అంచనాలు ఆకాశాన్ని తాకేలా చేస్తున్నాయి. మరి రాజమౌళి ఇప్పుడు ఎలాంటి వీడియోని చేస్తాడో చూడాలి మరి!