Movies : లైగర్ వచ్చేదాకా మార్కెట్ అంతా మీడియం, చిన్న సినిమాలదే..

కరోనా సెకండ్ లాక్ డౌన్ తర్వాత వరసగా సూపర్ స్టార్ల సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. పక్కకు తప్పుకుని, వాటికి లైన్ క్లియర్ చేశాయి లోబడ్జెట్ సినిమాలు. ఇప్పుడు.............

Movies : లైగర్ వచ్చేదాకా మార్కెట్ అంతా మీడియం, చిన్న సినిమాలదే..

Tollywood Movie S

Tollywood :  కరోనా సెకండ్ లాక్ డౌన్ తర్వాత వరసగా సూపర్ స్టార్ల సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. పక్కకు తప్పుకుని, వాటికి లైన్ క్లియర్ చేశాయి లోబడ్జెట్ సినిమాలు. ఇప్పుడు సూపర్ స్టార్లు థియేటర్లకు విరామం ప్రకటించి షూటింగ్స్ లో బిజీ అయ్యారు. దాంతో లోబడ్జెట్ సినిమాలకు లైన్ క్లియర్ అయ్యింది. ఇప్పుడు విజయ్ దేవరకొండ లైగర్ వచ్చే వరకు భారీ బడ్జెట్ సినిమాలే లేవు. స్టార్లందరూ థియేటర్లకు విరామం ఇచ్చి, షూటింగ్స్ తో బిజీ అయ్యే సరికి లోబడ్జెట్ సినిమాలు క్యూ కట్టి, బాక్సాఫీసు ముందు తలబడుతున్నాయి.

Vajpayee Biopic : వెండితెరపై వాజ్‌పేయి జీవితకథ..

జులై 1న పక్కా కమర్షియల్, షికారు, టెన్త్ క్లాస్ డైరీస్, ఏనుగు, గంధర్వ.. దాదాపు 5 సినిమాలు పోటీకి దిగుతున్నాయి.

జులై 8న పోటీయే లేకుండా లావణ్య త్రిపాఠి హాపీబర్త్ డేతో దిగుతుంది.

జులై 14న ఎనర్జిటిక్ స్టార్ రామ్, కృతిశెట్టి జంటగా లింగుస్వామి తెరకెక్కించిన ది వారియర్, 15న సత్యదేవ్, తమన్నా నటించిన గుర్తుందా శీతాకాలం సినిమాలు రిలీజ్ కానున్నాయి.

జులై 22న మీడియం రేంజ్ సినిమాల మధ్య గట్టి పోటీ ఉండబోతుంది. నిఖిల్ కార్తికేయ సీక్వెల్ గా వస్తోన్న కార్తికేయ 2, అలాగే వరస సక్సెస్ లతో దూసుకెళ్తోన్న నాగచైతన్య థాంక్యూ సినిమాలు రిలీజ్ అవుతుండగా, బాలీవుడ్ నుంచి షంషేరా లాంటి రణబీర్ కపూర్ డబ్బింగ్ మూవీ కూడా జులై 22నే రిలీజ్ అవుతుంది.

జులై 28న కిచ్చా సుదీప్ మూవీ విక్రాంత్ రోణ, 29న మాస్ రాజ రవితేజ రామారావు ఆన్ డ్యూటీ, హిట్ 2 సినిమాలు రానున్నాయి.

ఆగస్టు ఫస్ట్ వీక్ లో సీతారామం, సెకండ్ వీక్ లో కళ్యాణ్ రామ్ బింబిసార, నితిన్ మాచర్ల నియోజకవర్గం, స్వాతిముత్యం సినిమాలు వస్తున్నాయి.

ఇక ఆగస్టు 25న పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ బడ్జెట్ లైగర్ థియేటర్లోకి రానుంది. సో లైగర్ వచ్చే వరకు లోబడ్జెట్, మిడ్ రేంజ్ సినిమాల మధ్య బాక్సాఫీస్ వార్ జరగనుంది. మరి ఈ వార్ లో ఏ సినిమా గెలుస్తుందో, ఏ సినిమాలకి కలెక్షన్స్ కురుస్తాయో చూడాలి.