NTR 100 Years : సీనియర్ ఎన్టీఆర్ డైరెక్షన్.. జూనియర్ ఎన్టీఆర్‌ నటుడు.. ఆ సినిమా ఏంటో తెలుసా?

సీనియర్ ఎన్టీఆర్ లెగసీని మరో తరం ముందుకు తీసుకు వెళ్లడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న జూనియర్ ఎన్టీఆర్.. తన మొదటి సినిమాని రామారావు డైరెక్షన్ లోనే చేశాడు.

NTR 100 Years : సీనియర్ ఎన్టీఆర్ డైరెక్షన్.. జూనియర్ ఎన్టీఆర్‌ నటుడు.. ఆ సినిమా ఏంటో తెలుసా?

Junior NTR acted in senior NTR direction along with Balakrishna

100 Years of NTR : విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గురించి తెలుగు వారికీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు వారిని ప్రపంచం మొత్తానికి తెలియజేసేలా చేసిన ఆయన ప్రయాణం.. చరిత్రగా ఎప్పటికి నిలిచిపోతుంది. నటుడిగా జానపధం, పౌరాణికం, సాంఘికం, చారిత్రకం.. ఇలా ప్రతి దానిలో ఆయనకి తిరుగు లేదని అనిపించుకున్నారు. కేవలం నటుడు గానే కాదు రైటర్‌గా, ఎడిటర్‌గా, దర్శకుడిగా, నిర్మాతగా తెలుగు కళామతల్లికి ఎన్నో సేవలు అందించారు.

NTR 100 Years : తారక్, నేను కాదు.. సౌత్ ఇండియాని వరల్డ్ మ్యాప్‌లో పెట్టిన నటుడు ఎన్టీఆర్.. రామ్‌చరణ్!

అలా దర్శకుడిగా ఎన్నో సినిమాలను తెరకెక్కించిన ఎన్టీఆర్.. తన వారసులు అయిన బాలకృష్ణ, హరికృష్ణలను కూడా డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. అలాగే జూనియర్ ఎన్టీఆర్ ని రామారావు డైరెక్ట్ చేశారు. నటుడిగా తారక్ కి అదే మొదటి సినిమా కావడం కూడా విశేషం. 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి రాజకీయం వైపు వెళ్లిన ఎన్టీఆర్.. దాదాపు 7 ఏళ్ళ గ్యాప్ తరువాత కమ్‌బ్యాక్ ఇస్తూ చేసిన సినిమా ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’. ఈ చిత్రానికి స్టోరీ, స్క్రీన్ ప్లే, మాటలు, డైరెక్షన్, ఎడిటింగ్, నిర్మాత, నటుడు.. అంతా తానే అయ్యి సినిమాని తెరకెక్కించారు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ విశ్వామిత్ర, రావణుడిగా రెండు పాత్రలో కనిపించారు. బాలకృష్ణ కూడా సత్య హరిశ్చంద్ర మరియు దుశ్యంత పాత్రలో డ్యూయల్ రోల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇక ఈ సినిమాలో ముఖ్య పాత్ర అయిన ప్రిన్స్ ‘భారత’ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ (NTR) నటించాడు. మొదటి సినిమాని తాతతో కలిసి షేర్ చేసుకున్న తారక్.. ఇప్పుడు ఆయన లెగసీని మరో తరం ముందుకు తీసుకు వెళ్లడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.

NTR 100 Years : నందమూరి అభిమానులకు షాక్ ఇచ్చిన కరాటే కళ్యాణి.. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ పై కోర్ట్ స్టే..

కాగా ఈ సంవత్సరం ఎన్టీఆర్ శత జయంతి జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వేడుకలను బాలకృష్ణ (Balakrishna) చాలా ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే మొన్న విజయవాడ ఒక కార్యక్రమం, ఇటీవల హైదరాబాద్ ఒక కార్యక్రమాన్ని చేశారు. ఈ నెల 28న శత జయంతి కార్యక్రమాన్ని రాజమండ్రిలో ఘనంగా నిర్వహించబోతున్నట్లు ఇటీవల జరిగిన హైదరాబాద్ ఈవెంట్ లో బాలకృష్ణ తెలియజేశాడు.