NTR: జపనీస్ బాషాని కూడా మాట్లాడేస్తున్న జూనియర్ ఎన్టీఆర్..

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా "ఆర్ఆర్ఆర్" మేనియా ఇంకా కొనసాగుతూనే ఉంది. రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ఇండియన్ ఆడియన్స్ తో పాటు ప్రపంచ సినీ సాంకేతిక నిపుణల చేత కూడా అభినందనలు అందుకుంటుంది. ఈ క్రమంలోనే జపాన్ లో ఈ శుక్రవారం రిలీజ్ కాగా..

NTR: జపనీస్ బాషాని కూడా మాట్లాడేస్తున్న జూనియర్ ఎన్టీఆర్..

Junior NTR Speaks Japanese Language in RRR Promotions at Japan

NTR: జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా “ఆర్ఆర్ఆర్” మేనియా ఇంకా కొనసాగుతూనే ఉంది. రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ఇండియన్ ఆడియన్స్ తో పాటు ప్రపంచ సినీ సాంకేతిక నిపుణల చేత కూడా అభినందనలు అందుకుంటుంది. దీంతో ఈ మూవీ ప్రపంచంలోని ఇతర భాషలోకి కూడా అనువదించి విడుదలకు సిద్ధం చేస్తున్నారు చిత్ర యూనిట్.

NTR: జూనియర్ ఎన్టీఆర్ కి జపాన్ అభిమానుల లేఖ..

ఈ క్రమంలోనే జపాన్ లో ఈ శుక్రవారం రిలీజ్ కాగా.. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం మూవీ టీం ఆ దేశానికీ చేరుకుంది. గత మూడు రోజులుగా పలు ఇంటర్వ్యూలు, జపాన్ టీవీ షోలకు హాజరవుతూ భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తారక్ జాపనీస్ లో మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఈ వీడియోలో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. “అందరకి నమస్కారం. మీరు ఎలా ఉన్నారు. మిమ్మల్ని కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ మూవీ చూసి ఎంజాయ్ చేయండి, థ్యాంక్యూ” అంటూ జపనీస్ లో వ్యాఖ్యానించాడు. గతంలో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ సమయంలో భారతీయ భాషల్ని అలవోకోగా మాట్లాడి అదరగొట్టిన తారక్, ఇప్పుడు జపనీస్ బాషాని కూడా మాట్లాడేస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు.