‘ఆహా’ తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో గేమ్ ఛేంజర్‌ : మై హోమ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామ్ జూపల్లి

  • Published By: sekhar ,Published On : November 13, 2020 / 07:38 PM IST
‘ఆహా’ తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో గేమ్ ఛేంజర్‌ : మై హోమ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామ్ జూపల్లి

Aha Grand Event: సరికొత్త కంటెంట్‌తో కూడిన సినిమాలు, వెబ్ సిరీస్‌తో రోజురోజుకీ ప్రేక్షకులకు మరింత చేరువవుతోంది తొలి తెలుగు ఓటీటీ ‘ఆహా’. ప్రారంభమైన ఏడాదిలోపే అద్భుత విజయాన్ని సాధించింది.
ఇప్పటికే 18 మిలియన్ల యూజర్స్, 6 మిలియన్ల డౌన్‌లోడ్స్‌తో జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోంది.

ఈ సందర్భంగా హైదరాబాద్ లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో అదిరిపోయే ఈవెంట్ ఏర్పాటు చేశారు ‘ఆహా’ నిర్వాహకులు. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో ఇదే అతిపెద్ద ఈవెంట్. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేస్తుండగా.. అల్లు అరవింద్, ఆహా సీఈవో అజిత్ ఠాకూర్, మై హోమ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామ్ జూపల్లి, దిల్ రాజు, దిల్ రాజు కుమార్తె హన్షితా రెడ్డి, అల్లుడు అర్చిత్ రెడ్డి, వంశీ పైడిపల్లి, శరత్ మరార్ తదితరులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా మై హోమ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామ్ జూపల్లి మాట్లాడుతూ : ‘‘ప్రారంభించిన అతితక్కువ సమయంలోనే ‘ఆహా’ తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో గేమ్ ఛేంజర్‌గా నిలిచింది.. రాబోయే రోజుల్లో మరింత ఎగ్జైటింగ్ స్టఫ్‌తో మిమ్మల్ని అలరించడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం.. ఛైర్మన్, మా తండ్రి డా.రామేశ్వరరావ్ గారు నెంబర్ వన్‌గా నిలవడానికి మాకు ఎల్లప్పుడూ స్ఫూర్తి. తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో టాప్ పొజిషన్‌లో ఉండడానికి తోడ్పాడునందించిన ఆయన విజన్, గైడెన్స్, కాన్ఫిడెంట్ కి థ్యాంక్స్..

‘ఆహా’ యాప్‌కు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 6 మిలియన్ల యాప్ డౌన్‌లోడ్స్, 18 మిలియన్ల యూజర్స్, 40 మిలియన్లకు పైగా వ్యూవర్షిప్ ఉంది.. త్వరలో విదేశాల్లో సైతం ‘ఆహా’ ను మరింత విస్తరింపచేస్తాం..
రోజురోజుకి సబ్ స్క్రైబర్స్ పెరగడమనేది మా బాధ్యతను మరింత పెంచుతోంది.. కచ్చితంగా తెలుగు ప్రేక్షకులను మరింత అలరించే కంటెంట్‌తో ‘ఆహా’ ముస్తాబవుతోంది’’ అన్నారు.