Helmet పెట్టుకోలేదని Fine వేశారు – తాప్సీ

  • Published By: madhu ,Published On : November 18, 2020 / 10:35 PM IST
Helmet పెట్టుకోలేదని Fine వేశారు – తాప్సీ

I was fined for no helmet : బైక్ నడిపే సమయంలో..తాను హెల్మెట్ పెట్టుకోనందుకు ఫైన్ వేశారంటూ..సినీ నటి తాప్సీ వెల్లడించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారామె. సినిమాలు, ఇతర విషయాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ..అభిమానులతో పంచుకుంటారనే సంగతి తెలిసిందే. తాజాగా బుధవారం నాడు ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.



సినిమా షూటింగ్ లో భాగంగా…ఓ బైక్ ను నడుపుతున్నారు. వెనుక నుంచి ఆ ఫొటో తీశారు. బైక్ పై కూర్చొన్న అమ్మాయి..తాప్సీనే అని గుర్తుపట్టడం కష్టంగా ఉంది. ఈ ఫొటో పోలీసుల దృష్టికి వచ్చింది. ఫొటో కొట్టి ఆమెకు ఫైన్ విధించారు. ఈ విషయాన్ని ఆమె అభిమానులతో పంచుకున్నారు. ఛలనా విధించడానికి ముందు..అంటూ తను షేర్ చేసిన ఫొటోకు క్యాప్షన్ సైతం జోడించారామె.
ఇక తాప్సీ విషయానికి వస్తే..‘ఝుమ్మంది నాదం’ చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. మంచి మంచి సినిమాలు ఎంచుకుంటూ..ముందుకు సాగుతున్నారు.



టాలీవుడ్ సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ..అకస్మాత్తుగా బాలీవుడ్ కు మాకం మార్చారు. లేడీ ఓరియంటెడ్ సినిమాలతో పాటు..స్టార్ హీరోల సరసన నటిస్తూ..బిజీ బిజీగా మారిపోయారు. విజయ్ సేతుపతితో కలిసి ఓ తమిళ సినిమాలో నటించారు. ప్రస్తుతం ‘రష్మీ రాకెట్’ సినిమాలో అథ్లెట్ గా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం కష్టపడుతున్నారు. డైట్ మార్చేసి..ఎక్సర్ సైజ్ మీద అధికంగా దృష్టి పెడుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Taapsee Pannu (@taapsee)