K. Vijaya Bhaskar: ఒక్కప్పుడు స్టార్ మూవీస్ తీసిన డైరెక్టర్.. ఇప్పుడు చిన్న సినిమాతో!

ఒక్కపుడు స్టార్ హీరోలతో సినిమాలు తీసి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు అందించిన దర్శకుడు. ఇప్పుడు ఒక చిన్న హీరోని పరిచయం చేస్తూ, ఒక చిన్న సినిమాతో.. సుదీర్ఘ విరామం తరువాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

K. Vijaya Bhaskar: ఒక్కప్పుడు స్టార్ మూవీస్ తీసిన డైరెక్టర్.. ఇప్పుడు చిన్న సినిమాతో!

K. Vijaya Bhaskar: స్వయంవరం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు, మల్లీశ్వరి లాంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాల దర్శకుడు కే విజయ్ భాస్కర్, కొంత విరామం తర్వాత మెగాఫోన్ పడుతున్నారు. ఆయన దర్శకత్వంలో ప్రముఖ పారిశ్రామికవేత్త గుంటూరు రామకృష్ణ ఎస్ఆర్కే బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకట శ్రీనివాస్ బొగ్గరం సమర్పిస్తున్నారు. ‘శ్రీ కమల్’ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో ‘శివాని రాజశేఖర్’ కథానాయిక పాత్ర పోషిస్తున్నారు.విజయ భాస్కర్‌ దర్శకత్వంలో వస్తున్న 13వ చిత్రమిది. ఈ చిత్రానికి ‘జిలేబి’ అనే ఇంటరెస్టింగ్ టైటిల్ ని ఖరారు చేశారు.

Jilebi Movie opening ceremony : శివాని రాజశేఖర్ ‘జిలేబి’ మూవీ ఓపెనింగ్ గ్యాలరీ

విజయదశమిని పురస్కరించుకొని ఈ చిత్ర ప్రారంభోత్సవం.. చలన చిత్ర ప్రముఖుల సమక్షంలో గ్రాండ్ గా జరిగింది. నిర్మాత స్రవంతి రవి కిషోర్ స్క్రిప్ట్ అందించగా డాక్టర్ రాజశేఖర్ కెమరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్లాప్ ఇవ్వగా, తొలి సన్నివేశానికి బి గోపాల్ దర్శకత్వం వహించారు. అనంతరం చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా దర్శకుడు కె విజయ భాస్కర్ మాట్లాడుతూ.. చాలా విరామం తర్వాత మళ్ళీ దర్శకత్వం చేయడం ఆనందంగా వుంది. రామకృష్ణ, శ్రీనివాస్ గారితో కలసి సినిమా చేయడం చాలా సంతోషంగా వుంది. త్వరలో పూర్తి వివరాలు తెలియజేస్తాం” అన్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ, గెటప్ శ్రీను, గుండు సుదర్శన్, బిత్తిరి సత్తి ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.