K Viswanath with Star Heros : స్టార్ హీరోలతో ప్రయోగాలు చేయించిన డైరెక్టర్ కె.విశ్వనాథ్..

కళామతల్లి ముద్దబిడ్డ కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూశారు. విశ్వనాథ్ సినీ కెరీర్ చూసుకుంటే ఎన్నో అవార్డులు, రివార్డులు ఉన్నాయి. వాటిని సాధించడంలో కూడా ఆయన ఎన్నో ప్రయోగాలే చేశారు.

K Viswanath with Star Heros : స్టార్ హీరోలతో ప్రయోగాలు చేయించిన డైరెక్టర్ కె.విశ్వనాథ్..

K Viswanath with Star Heros : కళామతల్లి ముద్దబిడ్డ కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూశారు. గత కొంత కాలంగా వయోభారంతో బాధ పడుతున్న విశ్వనాథ్ రెండు రోజులు క్రితం తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. చికిత్స పొందుతున్న ఆయన ఫిబ్రవరి 2వ తేదీ రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. సినీ, రాజకీయ ప్రముఖులు విశ్వనాథ్ మరణానికి చింతిస్తూ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. ప్రస్తుతం విశ్వనాథ్ భౌతికకాయాన్ని ఆయన ఇంటి వద్ద ఉంచారు. ఆయనని కడసారి చూసేందుకు అభిమానులు, ప్రముఖులు ఇంటి వద్దకి చేరుకుంటున్నారు. ఆయన అకాల మరణం కారణంగా తెలుగు పరిశ్రమ నేడు బంద్ ప్రకటించింది.

K Viswanath : కళాతపస్వికి కళాకారులు నివాళులు.. నేడు షూటింగ్స్ బంద్..

కాగా విశ్వనాథ్ సినీ కెరీర్ చూసుకుంటే ఎన్నో అవార్డులు, రివార్డులు ఉన్నాయి. వాటిని సాధించడంలో కూడా ఆయన ఎన్నో ప్రయోగాలే చేశారు. విశ్వనాథ్ కెరీర్ లో 50 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ ప్రయాణంలో ఎన్టీఆర్, ఏఎన్నాఆర్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన బాబు, చిరంజీవి, కమల్ హాసన్, వెంకటేష్, అజయ్ దేవగన్ వంటి స్టార్స్ తో సినిమాలు చేశారు. వీరిలో దాదాపు మాస్ ఇమేజ్ ఉన్న తారలే ఎక్కువ. ఈ మాస్ హీరోలతో క్లాస్ మూవీస్ చేసి ప్రేక్షకుల చేత శబాష్ అనిపించుకున్నారు. హీరోలంతా విశ్వనాథ్ దర్శకత్వంలో నటించడం ఒక ఛాలెంజ్ లా భావించేవారు. ఎందుకంటే ఆయన కథలో పాత్రలు మాత్రమే కనిపిస్తాయి, పాత్రధారులు కాదు.

సౌండ్ ఇంజనీర్ గా కెరీర్ మొదలు పెట్టిన విశ్వనాథ్ ఆత్మగౌరవం సినిమాతో దర్శకుడిగా మారారు. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించారు. ఆ తరువాత ‘కలిసొచ్చిన అదృష్టం’తో ఎన్టీఆర్ ని, ‘ఉండమ్మా బొట్టు పెడతా’తో కృష్ణని, ‘జీవన జోతి’తో శోభన బాబుని డైరెక్ట్ చేశారు. ఆ తరం తరువాత వచ్చిన చిరంజీవి మాస్ హీరోగా నీరాజనాలు అందుకుంటున్న సమయంలో ‘స్వయంకృషి’ వంటి సినిమా తీసి చిరంజీవితో చెప్పులు కుట్టించాడు. సినిమా చిత్రీకరణ సమయంలో చిరంజీవిని అభిమానులు చెప్పులు కుడుతుంటే చూసి ఊరుకుంటారా? అని చాలామంది ప్రశ్నించేవారంట. కానీ చిరు అవేవి పట్టించుకోకుండా విశ్వనాథ్ ని నమ్మి ముందుకు వెళ్ళాడు. ఫలితంగా అభిమానుల ప్రేమనే కాదు, నటుడిగా అవార్డులను సైతం అందుకున్నాడు.

అలాగే తమిళంలో మాస్ హీరోగా ఉన్న కమల్ హాసన్ తో సాగరసంగమం, స్వాతిముత్యం వంటి సినిమాలు, వెంకటేష్ తో స్వర్ణకమలం, చిన్నబ్బాయి చేసి తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకున్నారు విశ్వనాథ్. హిందీలో పలు సినిమాలు చేసిన విశ్వనాథ్.. అనిల్ కపూర్ తో స్వాతిముత్యం రీమేక్, జాకీ ష్రాఫ్ తో ‘సంగీత్’, అజయ్ దేవగన్ తో ధన్వాన్ చిత్రాలు తెరకెక్కించారు. ఆయన మరణం భారతీయ సినీ ప్రపంచానికి తీరని లోటు అనే చెప్పాలి.